X
లవ్‌లీ

లవ్‌లీ

Romance | 30 Mar 2012 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

లవ్‌లీ స్టోరీ

లవ్‌లీ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, శాన్వి , రాజేంద్రప్రసాద్, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, చిన్మయి, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, ఆహుతి ప్రసాద్, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ, వినయ ప్రసాద్, హర్షవర్ధన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి బి జయ నిర్వహించారు మరియు నిర్మాత బి ఎ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకుర్చారు. కథ ఆకాష్(ఆది) ప్రాక్టికల్‌గా అందరితో సరదాగా కలిపోయే యువకుడు. ఆడవారన్నా, ప్రేమన్నా పెద్దగా ఇంట్రస్టు ఉండదు. అతని ఫ్రెండ్ కిట్టు(వెన్నెల కిషోర్) ఫేస్‌బుక్‌ ద్వారా లల్లి(చిన్మయి) అనే అమ్మాయితో ఆన్ లైన్ స్నేహం చేస్తుంటాడు. ఫోన్లు, చాటింగులే తప్ప ఇద్దరు ఎప్పుడూ చూసుకోరు. ఒక రోజు ఇద్దరూ కలవాలనుకుంటారు. లల్లిపై ప్రేమ పెంచుకున్న కిట్టు ఆమె వద్దంటే తట్టుకునే ధైర్యం లేక....తన బదులు తన స్నేహితుడు ఆకాష్‌ను పంపుతాడు. ఇటు లల్లి కూడా తను వెల్లకుండా తన ఫ్రెండ్ లావణ్య(శాన్వి)ని పంపుతుంది. ఈ క్రమంలో తొలి చూపులోనే ఆకాష్, లావణ్య ఒకరిపై ఒకరు మనసు పారేసుకుంటారు. తమ ఫస్ట్ మీటింగులో ఆకాష్ బిహేవియర్ చూసిన లావణ్య తండ్రి మంగళంపల్లి మహారథి(రాజేంద్రప్రసాద్) అతనిపై అయిష్టాన్ని పెంచుకుంటాడు. అయితే కూతురు అంటే ఎంతో ఇష్టపడే మహారథి.....తనకు ఇష్టం లేకున్నా ఆకాష్‌తో ఆమె ప్రేమకు ఒప్పుకున్నాడా? లేక ఇంకేమైనా చేశాడా? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

లవ్‌లీ కాస్ట్ & క్రూ

లవ్‌లీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జయ బి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత రాజు బి ఎ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లవ్‌లీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిన సినిమా సెకండాఫ్‌లో టెంపో తగ్గి నేరేషన్ స్లో అయిపోయింది. క్లైమాక్స్ పేలవంగా ఉండటం కూడా సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. దర్శకురాలు చాలా చోట్ల ముఖ్యమైన సన్నివేశాల్లో చిన్న చిన్న పొరపాట్లు చేసింది. అనూప్ రూబెన్స్ సంగీతం, శ్యాం డైలాగులు సినిమాకు ప్లస్ పాయింట్స్. ఆది డాన్స్, ఫైటింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. రొమాంటిక్ ట్రాక్ బాగా పండటం, ఫ్యామిలీ జనాలకు నచ్చే అంశాలు ఉండటం వల్ల సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. మొత్తం మీద ఈసినిమా యావరేజ్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. మరి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

లవ్‌లీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లవ్‌లీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+