మాయోన్ సినిమా మిస్టరీ, మైథలాజికల్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం సిబిరాజ్, తాన్యా రవిచంద్రన్, రాధా రవి, కేఎస్ రవికుమార్, ఎస్ఏ చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్, హరీష్ పేరడి, అరాష్ షా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిషోర్ ఎన్ వహించారు. సంగీతం ఇళయరాజా అందించారు
కథ
అర్జున్ (సిబిరాజ్), అంజనా (తన్యా రవిచంద్రన్), దేవరాజ్ (హరీష్ పేరడి) పురావస్తు శాఖలో పనిచేస్తుంటారు. అయితే 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మయోన్ ఆలయంలోని సీక్రెట్ గదిలో గుప్త నిధుల గురించి పరిశోధన చేస్తుంటారు. అయితే 6 గంటల తర్వాత ఆలయం తలుపులు మూసిన తర్వాత ఆలయంలోకి వెళ్లినవాళ్లు పిచ్చివాళ్లుగా మారిపోతారనే మూఢనమ్మకం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అర్జున్, అంజనా తన సహ ఉద్యోగులతో కలిసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆలయంలోకి వెళ్తారు. ఆలయం తలుపులు మూసిన తర్వాత లోనికి వెళ్తే పిచ్చివాళ్లు అవుతారనేది మూఢ నమ్మకమేనా? 5 వేల సంవత్సరాల చరిత్ర గిలిగిన ఆలయంలోకి గంధర్వులు వస్తారా? అలాంటి ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడు రాత్రి నిద్రిస్తారా? ఇంతకు ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయా? సీక్రెట్ రూంలో గుప్త నిధులపై పరిశోధన చేసిన అర్జున్, అంజనా ఎలాంటి ఫలితం దక్కింది. ఆరు గంటల తర్వాత లోనికి వెళ్లిన అర్జున్, అంజనాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సీక్రెట్ గదిని అర్జున్ బృందం కనుకొన్నారా? గుప్త నిధులు కొట్టేయాలని కుట్ర పన్నిన దేవరాజ్ ప్రయత్నం ఫలించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే మాయోన్ సినిమా కథ.