మ్యాస్ట్రో సినిమా రొమాంటిక్, థ్రిలర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, జిషు సేన్ గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మేర్లపాక గాంధీ వహించారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి ఎన్, నికిత రెడ్డి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సాగర్ మహతి అందించారు.
చూపు ఉన్నా అంధుడిగా నటించే అరుణ్ ( నితిన్) సోఫి (నభా నటేష్)కు చెందిన పెడ్రో అనే రెస్టారెంట్‌లో పియానో వాయిస్తూ సంగీతం అందిస్తుంటాడు. కళ్లు లేకపోయినా అద్భుతమైన మ్యూజిక్ ప్రతిభ కలిగిన అరుణ్ ప్రేమలో సోఫి పడిపోతుంది. ఆ రెస్టారెంట్‌కు తరచు వచ్చే సినీ హీరో నరేష్ (వీకే నరేష్)ను అరుణ్ ఆకట్టుకొంటాడు. తన భార్య సిమ్రాన్ (తమన్నా భాటియా) పుట్టిన రోజున ప్రైవేట్ కన్సర్ట్‌ను ఏర్పాటు చేయాలని అరుణ్‌ను తన నరేష్ పిలుస్తాడు. అరుణ్ వచ్చే సరికి నరేష్ తన ఇంటిలో హత్యకు గురై ఉంటాడు. నరేష్ హత్యా ఘటన నేపథ్యంలో ఓ దశలో అరుణ్‌కు నిజంగానే చూపును కోల్పోతాడు. అరుణ్ అంధుడిగా ఎందుకు నటించాలని అనుకొంటాడు? సినీ హీరో నరేష్‌ను సొంత భార్య సిమ్రాన్ ఎందుకు హత్య చేసింది? నరేష్ హత్యను చూసిన అరుణ్ ఎలా స్పందించాడు. ఈ క్రమంలో అరుణ్ నిజంగానే అంధుడిగా మారారు? అరుణ్‌ను ఇష్టపడిన సోఫి అతడికి ఎందుకు దూరమైంది? నరేష్ హత్య కేసుతో సీఐ బాబీ (సేన్ గుప్తా)కి ఎలాంటి సంబంధం ఉంది? సీఐ బాబీ భార్య లక్కీగా శ్రీముఖి ఎలా నటించింది? వీకే నరేష్ కూతురు పవిత్రగా అనన్య నాగళ్ల ఆకట్టుకొన్నారా? సింగర్ మంగ్లీ తన పాత్రకు న్యాయం చేసిందా లాంటి ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మ్యాస్ట్రో చూడాల్సిందే.