X
మనసుకు నచ్చింది
Romance | 16 Feb 2018 | U |
Telugu

మనసుకు నచ్చింది స్టోరీ

మనసుకు నచ్చింది సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, అమ్య్ర దస్తుర్, త్రిథా చౌధరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మంజుల ఘట్టమనేని వహించారు మరియు నిర్మాత సంజయ్ స్వారూప్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందించారు.

కథ

సూరజ్(సందీప్ కిషన్), నిత్యా( అమైరా దస్తూర్) చిన్నతనం నుండి కలిసే పెరుగుతారు. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం. ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ బాండింగ్ చూసి వీరు ప్రేమించుకుంటున్నారని అపోహపడిన పెద్దలు ఇద్దరి పెళ్లి ఫిక్స్ చేస్తారు. కానీ ఇద్దరి మధ్య పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం ఉండదు. (ఇష్టం లేనపుడు అప్పుడే పెద్దలకు చెప్పి పెళ్లిని ఆపేయొచ్చు కదా? అని మీకు డౌట్ రావొచ్చు. కానీ అలా చేస్తే మన సినిమా కథ ముందుకు సాగదు కదా) పెద్దల మాటను కాదనలేక పెళ్లి పిటల వరకు వెళతారు. తీరా ముహూర్తం సమయానికి ఇద్దరూ ఒకరితో ఒకరు లేచిపోతారు. కొంతకాలం తమకు నచ్చినట్లు ఉండాలని ఉద్దేశ్యంతో గోవా పారిపోతారు. ఈ సినిమా కథలోని అసలు పాయింట్ ఏమిటంటే.... మనం కళ్లతో చూసి ఇష్టపడినవి అన్నీ మన మనసు స్వీకరించదు. దానికంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి మనసు ఇష్టపడితే అది జీవితాంతం అలాగే ఉండిపోతుంది. మనసు ఇష్టపడింది దక్కకపోతే ఆ పెయిన్ జీవితాంతం ఉంటుంది. మన మనసుకు నచ్చింది చేసినపుడే జీవితాంతం సంతోషంగా ఉంటారు అనే చెప్పే ప్రయత్నంచేశారు. హీరో హీరోయిన్...... తమ కళ్లకు నచ్చింది ఏది, మనసుకు నచ్చింది ఏది అని తెలుసుకోవడానికి పడ్డ సంఘర్షణే మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+