twitter

    మసూద స్టోరి

    మసూద సినిమా  సస్పెన్స్‌,  థ్రిల్లర్‌ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయికిరణ్ వహించారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు. 

    కథ
    సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ గోపి (తిరువీర్) మహా భయస్తుడు, పిరికివాడు, మొహమాటస్థుడు. తన కంపెనీలో పనిచేసి మిన్ని (కావ్య కల్యాణ్ రామ్) అంటే పిచ్చి ప్రేమ. కానీ మనసులో మాట చెప్పడానికి వెనుకాడుతుంటాడు. ఇదిలా ఉంటే.. తన పొరుగింటిలో నీలం అనే టీచర్ (సంగీత) భర్తతో సపరేట్ అయి.. కూతురు నజియా హాసన్ (బాంధవి శ్రీధర్)తో జీవితం ముందుకు లాగడానికి కష్టాలు పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీలం కూతురుకు మసూద అనే దెయ్యం ఆవహిస్తుంది. దాంతో నీలంకు గోపి అండగా నిలువాలని అనుకొంటాడు. అసలే పిరికి వాడైన గోపి దెయ్యాల, పిశాచాల విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. నీలం, ఆమె కూతురు నజియాకు ఎలా అండగా నిలిచాడు? నీలం కుటుంబానికి సహాయం చేయడం వల్ల గోపికి ప్రియురాలి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. నీలం తన భర్త అబ్దుల్ (సత్య ప్రకాశ్)కు ఎందుకు దూరమైంది? నజియాను మసూద అనే దెయ్యం ఎందుకు పట్టి పీడించింది. మసూదను వదిలించేందుకు పీర్ బాబా (శుభలేఖ సుధాకర్), అల్లా ఉద్దీన్ (సత్యం రాజేశ్) ఎలాంటి చర్యలు తీసుకొన్నారు? ఇంతకు మసూద ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే మసూద సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie మసూద with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X