twitter

    నా ఇష్టం స్టోరి

    నా ఇష్టం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రానా,జెనీలియా, బ్రహ్మానందం, హర్షవర్ధన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, అలీ, భరత్, ఉత్తేజ్, ప్రగతి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ప్రకాష్ తోలేటి నిర్వహించారు మరియు నిర్మాత పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.

    కథ

    గణేష్(రానా)తాను బాగా స్వార్దపరుడుని అని ఫీలయ్యి,అలా బివేహ్ చేస్తూండే(అఫ్ కోర్స్ త్రాగితే నిస్వార్దపరుడుగా మారతాడనుకోండి) కుర్రాడు. మలేషియాలో సెటిలైన అతనికి ఓ రోజు ఇండియా నుంచి పారిపోయి వచ్చిన కృష్ణవేణి (జెనిలియా) పరిచయమవుతుంది. తన ప్రియుడు కిషోర్ (హర్షవర్దన్ రానే)ని పెళ్లి చేసుకుందామని తన తండ్రి(నాసర్)కి మస్కా కొట్టి మలేషియా వచ్చేసింది ఆమె. కొన్ని సినిమాటిక్ ట్విస్టు తర్వాత మన హీరో గణేష్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఈ లోగా అందరూ ఊహించినట్లుగానే కిషోర్ కథలోకి దూకేస్తాడు. అప్పుడు ఏమౌతుంది. హీరో త్యాగం చేసి ఆమెకు పెళ్లి చేస్తాడా...లేక స్వార్ధపరుడు కాబట్టి తన స్వార్దమే చూసుకుంటాడా వంటివి తెరపై చూసి తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలు.
    **Note:Hey! Would you like to share the story of the movie నా ఇష్టం with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X