X
నాయక్
Action | Romance | 09 Jan 2013 | A |
Telugu

నాయక్ స్టోరీ

నాయక్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్, కాజల్, అమలపాల్ , బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, రాహుల్ దేవ్, రఘుబాబు, సుధ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చారు.

కథ

చెర్రీ (రామ్ చరణ్) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన అంకుల్ జిలేబి(బ్రహ్మానందం) అత్యుత్సాహంతో నోరు జారి,ఇరుక్కోవటంతో లోకల్ డాన్ గండిపేట బాబ్జి (రాహుల్ దేవ్) దగ్గరకు సెటిల్ మెంట్ కు వెళ్లాళ్సి వస్తుంది. అయితే బాబ్జిని కలిసిన చెర్రికి అక్కడ బాబ్జీ చెల్లెలు మధు (కాజల్) తో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. దాంతో బాబ్జీని మాటలతో మభ్యపెట్టి ప్రస్తుతానికి ఆ గండం నుండి గట్టెక్కి, మధుని లైన్ లో పెట్టడానికి ప్రయత్నిస్తూంటాడు. మరోప్రక్క కలకత్తాలో,హైదరాబాద్ లలో చెర్రి పోలికలతో ఉన్న ఓ వ్యక్తి హత్యలు చేస్తూంటాడు. అతని కోసం సిబిఐ (ఆశిష్ విధ్యార్ధి)టీం వెతుకుతూంటుంది. ఇంతలో ఆ చెర్రి పోలికలతో ఉన్న మరో వ్యక్తి...నెక్ట్స్ మర్డర్ చేయబోయేది మినిస్టర్ రావత్ (ప్రదీప్ రావత్)అని తెలుస్తుంది. కుంభమేళాలో అతన్ని చంపబోతున్నాడని తెలుసుకున్న సీబీఐ అక్కడకి చేరుకుంటుంది. సరిగ్గా అదే సమయానకి చెర్రీ కూడా అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు సీబీఐ వారు చెర్రీని చూసి ఆరెస్టు చేయటానికి సిద్దమవుతారు....అసలు ఆ మరో వ్యక్తి ఎవరు...లేక చెర్రీనే ...ఆ హత్యలన్ని చేస్తున్నాడా...మరి నాయక్ కథేంటి, అమలాపాల్ కి ఈ చిత్రంలో పాత్ర ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే...సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+