X
నాన్నకు ప్రేమతో
Action | Romance | 13 Jan 2016 | U/A |
Telugu

నాన్నకు ప్రేమతో స్టోరీ

నాన్నకు ప్రేమతో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జూనియర్ ఎన్ టి ర్, రకుల్ ప్రితి సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సితార, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, రాజివ్ కనకాల, తాగుబోతు రమేష్, మధుబాల  తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ నిర్వహించారు మరియు నిర్మాత బి వి ఎన్ ఎస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చురు.

కథ

లండన్ ఎన్నారై అభిరామ్ (ఎన్టీఆర్) కు తన తండ్రి రమేష్ చంద్రప్రసాద్ (రాజేంద్రప్రసాద్) గురించిన ఓ నిజం తెలుస్తుంది. అయితే ఆ నిజం తెలిసేటప్పటికే ఆయన మృత్యువుకు దగ్గరై రోజులు లెక్కపెడుతూంటాడు. ఆ నిజం ఏమిటంటే...తన తండ్రిని క్లోజ్ ఫ్రెండ్ కౌటిల్య కృష్ణమూర్తి (జగపతిబాబు) మోసం చేసాడని. దాంతో కోపం తెచ్చుకున్న అభిరామ్ తన తండ్రి బ్రతికి ఉండే ఆ కొద్ది రోజుల్లోనే మోసం చేసిన కృష్ణమూర్తిని రోడ్డు మీదకు తీసుకు వచ్చి బుద్ది చెప్పాలనుకుంటాడు. అయితే కృష్ణమూర్తి సామాన్యుడు కాడు...తెలివైన పెద్ద బిజినెస్ మ్యాన్. అతనిదో పెద్ద వ్యాపార సామ్రాజ్యం. కృష్ణమూర్తిని పడగొట్టడానికి అభిరామ్ ఏం యాక్షన్ ప్లాన్ మొదలెట్టాడు. అందుకు కృష్ణమూర్తి ఎలా రెస్పాండ్ అయ్యి తిప్పికొట్టాడు. మధ్యలో కృష్ణమూర్తి కుమార్తె దేవిక (రకుల్) పాత్ర ఏమిటి... చివరకు ఏం జరిగింది అనేది మైండ్ గేమ్స్ తో సాగే కథ,కథనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+