నాయకి స్టోరి

    నాయకి సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు త్రిష కృష్ణన్, గణేష్ వెంకట్రామన్, సుష్మ రాజ్, సత్యం రాజేష్, జయప్రకాష్ వి, మనోబాల, బ్రహ్మానందం, కోవై సరళ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోవి నిర్వహించారు మరియు నిర్మాత గిరిధర్ మామిడి పల్లి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రఘు కుంచె స్వరాలు సమకుర్చరు. 


    కథ

    దుండగల్‌ ప్రాంతంలో వరుసగా కొంతమంది వ్యక్తులు అపహరణకు గురవుతుంటారు. అక్కడకు వెళ్లిన వాళ్లెవ్వరూ తిరిగి రారు. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని డేంజర్‌ జోన్‌లో పెడుతుంది. క్రమంగా వూరు ఖాళీ అవుతుంది. ప్రభుత్వం కూడా ఆ వూరి పొలిమేరలో ఓ గోడ కడుతుంది. సంజయ్ ("సత్యం" రాజేశ్) అనే ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఓసారి అనుకోకుండా దుండగల్‌ ప్రాంతంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడున్న ఒక బంగ్లాలో గాయత్రి (త్రిష) ఆత్మ తిరుగుతుంటుంది. దయ్యాలమీద నమ్మకం ఉందదు కానీ నిజానికి సంజయ్ చాలా భయస్తుడు. కానీ అమ్మాయిల ముందు బిల్డప్‌ కోసం తాను దయ్యాలను చెడుగుడు ఆడుకుంటాను అన్న రేంజ్ లో మాట్లాడుతూంటాడు. అలాంటి సంజయ్ కి గాయత్రి ఆత్మ తో ఎలాంటి అనుభవాలెదురయ్యాయి? దుండగల్‌ ప్రాంతంలో కనపడకుండా పోయిన చాలామందికీ గాయత్రీకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు సంజయ్‌ అక్కడకు ఎందుకు వెళ్లాడు? గాయత్రి కథేంటి...అనేది మిగతా కథా. 
    **Note:Hey! Would you like to share the story of the movie నాయకి with us? Please send it to us (popcorn@oneindia.co.in).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X