ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రెండవ భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు ఇందులో నటిస్తున్న వారు నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, రానా దగ్గుబాటి, సుమంత్, అమని, నందమూరి మోక్షజ్ఞ తేజ, మంజిమ మోహన్, భరత్ రెడ్డి, హిమ్మాన్సి చౌదరి, సచిన్ కేడెకర్ ఇంకా తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా కృష్ణ జాగర్లమూడి (క్రిష్) వహిస్తున్నారు మరియు నిర్మాతలు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందిస్తున్నారు.
కథ
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం.. అనూహ్యంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం.. ప్రజాకర్షణ పథకాలతో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం.. తరువాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్ బాగా నమ్మిన ఆయన పార్టీకే చెందిన నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌కు సీఎం కుర్చీని దూరం చేయడం.. తిరిగి ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాడి రాష్ట్రపతిని కలిసి తిరిగి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం.. క్యాన్సర్‌తో పోరాడుతూ ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కన్న బసవతారకం చివరి కోరికను నెరవేర్చుకోవడంతో ‘మహానాయకుడు’ కథ ముగుస్తుంది. అయితే ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం కోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? వాటిలో చంద్రబాబు పాత్ర ఎంత? బసవతారకం పాత్రకు ఈ కథలో ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? తొలిభాగంలో కొరవడిన ఎమోషన్స్‌ని రెండో భాగంలో క్యారీ చేయడంలో ఎంత వరకూ సక్సెస్ అయ్యారు లాంటివి తెరపై చూడాల్సిందే.