పెళ్ళి చూపులు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, నందు, అనీష్ కురువిల్లా, గురురాజ్ మానేపల్లి, ప్రియదర్శి, కెదర్ శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తరుణ్ భాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాతలు రాజ్ కందుకూరి, యస్ రాగినేని కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వివేక్ సాగర్ స్వరాలు సమకుర్చరు.
కథ
ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)... లైఫ్‌ను జాలీగా లీడ్ చేస్తూ ఇంజనీరింగ్ అతికష్టం మీద సప్లిలు రాసి పాసైనఇప్పటి జనరేషన్ కుర్రాడు. ఎంబీఏ పూర్తి చేసి సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్న అమ్మాయి చిత్ర (రీతు వర్మ). పనీ పాట లేకుండా తిరిగే ప్రశాంత్‌కు పెళ్లి చేయాలని, అప్పుడైనా జీవితం మీద బాధ్యత వస్తుందని చిత్రతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. సొంతగా వ్యాపారం చేస్తానంటే ఇంట్లో సపోర్టు లేకపోవడంతో పాటు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో... ఈ పెళ్లి చేపులకు సిద్ధమవుతుంది చిత్ర. కట్ చేస్తే పెళ్లి చూపుల్లో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, పుడ్ ట్రక్ బిజినెస్ చేసి సొంతగా తన కాళ్ల మీద నిలబడాలనే ఆలోచన ఉందనే విషయం చెప్పి పెళ్లి నిరాకరిస్తుంది. దీంతో ప్రశాంత్ వేరొక అమ్మాయితో పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెడతాడు. కానీ అక్కడ కూడా వర్కౌట్ కాక పోగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ప్రశాంత్‌కు వంటలు చేయడం అంటే ఇష్టం. దీంతో చిత్రతో కలిసి ట్రక్ బిజినెస్‌లో జాయిన్ అవుతాడు. రెండు విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న వీరి జీవితాల్లో పెళ్లి చూపులు తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ తర్వాత ఏమైంది? అనేది అసలు స్టోరీ...