రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్. ప్రముఖ ఛానెల్ ఏబీసీలో వచ్చే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా చరణ్ నిలిచాడు. అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో. ఈ షో లో రామ్ చరణ్ పాల్గొనున్నారని తెలిసి ఎంతో మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. రామ్ చరణ్ తో సెల్ఫీలు దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.