రంగుల రాట్నం సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, చిత్ర శుక్లా, సితార, ప్రియదర్శి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీరంజని వహించారు మరియు నిర్మాత అక్కినేని నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు.
కథ
విష్ణు (రాజ్ తరుణ్) ఓ కంపెనీని స్వయంగా నడుపుతుంటాడు. ఆయనకు తల్లి (సితార), స్నేహితుడు (ప్రియదర్శి) తప్ప మరొక బంధువు అంటూ ఉండరు. విష్ణుకు త్వరగా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలని తల్లి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ మధ్యలో కీర్తి (చిత్ర శుక్లా) అనే అమ్మాయిని విష్ణు తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత అనుకోకుండా తల్లి కన్నుమూస్తుంది? తల్లి మరణంతో ఒంటరి వాడైన విష్ణు.. కీర్తి ప్రేమను, తోడును కోరుకొంటాడు. కానీ ప్రేమ, పెళ్లి మధ్య ఊగిసలాడే మనస్తత్వం ఉన్న కీర్తీ కొంత సమయాన్ని అడుగుతుంది? కీర్తి పెళ్లికి కొంత సమయాన్ని అడుగడానికి కారణం ఏమిటి? కీర్తి ప్రేమను గెలుచుకొన్నాడా? చివరికి ఏ విధంగా పెళ్లి చేసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే రంగుల రాట్నం కథ.