రాయలసీమ లవ్‌స్టోరి సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకట్, పావని, నాగినీడు , 30 ఇయర్స్ పృథ్వీ , జీవా , నల్ల వేణు , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , కొమరం , జబర్దస్త్ రాజమౌళి , మిర్చి మాధవి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ , మధుమని తదితరులు నటించారు. A1 ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ద్వారా రామ్ రణధీర్ దర్శకుడిగా పరిచయం అయ్యరు. పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా - నాగరాజు సంయుక్తంగా నిర్మించారు. సంగీతం శ్రీ సాయి యెలెందర్ అందించారు.
కథ
జీవితంలో అమ్మాయితో ప్రేమ అనేవి లేకపోతేనే మగాడు ప్రశాంతంగా ఉంటాడు అనుకునే వ్యక్తి కష్ణ (వెంకట్). అలాంటి వ్యక్తి పోలీసు ఆఫీసర్ అవ్వాలనే గోల్‌ను కూడా పక్కన పెట్టి రాధ (హ్రిశాలి) ద్వేషించే క్రమంలో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆ ప్రేమ అర్ధంతరంగా విఫలం అవుతుంది. దేవదాస్‌లా మారిపోయిన అతనికి ఓ వార్త షాక్‌కు గురిచేస్తుంది. అది ఫ్లాష్‌బ్యాక్‌లో తన కథ గుర్తుకు తెస్తుంది. అది ఏమిటి? ఆ తర్వాత అతని ప్రేమ ఏమయింది? అనుకున్న గోల్ నెరవేరిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.