X
Home టాప్ లిస్టింగ్

2023లో రాబోయే పాన్ ఇండియా సౌత్ మూవీస్ లిస్ట్..!

Author Administrator | Published: Tuesday, April 25, 2023, 03:17 PM [IST]

2023లో రాబోయే సౌత్ ఇండియన్ క్రేజీ పాన్ ఇండియా సినిమాలపై అందరి దృష్టి పడింది. సలార్ నుండి గేమ్‌ ఛేంజర్‌ సినిమా వరకు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీగా ఉన్నాయి..2023లో ఓ డజన్ సౌత్ సినిమాలపై ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది..? అవి 2023లో హిందీ బాక్సుల్ని కొల్లగొట్టబోతున్నాయా..? అనేది చూడాలి మరి


cover image
సలార్
1

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ రాబోతోంది. ఈ చిత్రాన్ని 2023లో ఎలాగైనా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.సలార్ సినిమాకి కూడా దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా ప్రెస్ రిలీజ్ లో ఈ 400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లుగా పేర్కొన్నారు. 

జైలర్
2

రజనీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీ 2023లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

భారతీయుడు 2
3

90వ దశకం చివరిలో విడుదలైన భారతీయుడు మూవీ భారీ విజయాన్ని అందుకుంది. 30 ఏండ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్ కాంబోలో ఇండియన్ మూవీకి సీక్వెల్ రాబోతోంది.

గేమ్‌ ఛేంజర్‌
4

రామ్ చరణ్ శంకర్‌ల కలయికలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్‌ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. RRR అనంతరం రామ్ చరణ్ నుంచి వస్తున్న హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకి కూడా దాదాపు 350 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి భారీగానే ఖర్చు పెడుతున్నారు.

Project K
5

500 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా ప్రభాస్ బాగా ఆశలు పెట్టుకున్నాడు… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా దీపిక పడుకోన్ హీరోయిన్… ఆమెకు తొలి తెలుగు సినిమా… అమితాబ్ బచ్చన్ కూడా ఓ పాత్రలో కనిపిస్తాడు… ఎలాగూ పాన్ ఇండియా మూవీయే…

6

ఛియాన్ విక్రమ్ పొన్నియిన్ సెల్వన్ తరువాత బాగా కష్టపడుతున్న సినిమా థంగలాన్… కబాలి, కాలా తదితర సినిమాలు తీసిన పా రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది… దీన్ని కూడా అయిదు పాపులర్ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్…

పుష్ప ది రూల్
7

అల్లు అర్జున్ హీరోగా పుష్ప ఎంతటి విజయం అందుకుందో మనందరికీ తెలుసు. పుష్ప 2 2023 లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.పుష్ప ద రైజ్‌ మూవీ బాక్సాఫీస్‌ను దున్నేసింది. ఈ పాన్‌ ఇండియా మూవీ తెలుగులోనే కాదు హిందీ, మలయాళం భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించింది. అయితే తొలి పార్ట్‌ సక్సెస్‌ కావడంతో సెకండ్‌ పార్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

హరి హర వీరమల్లు
8

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిత్రంతో పాన్ ఇండియా అరంగేట్రం చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

పొన్నియన్ సెల్వన్-2
9

మణిరత్నం డైరెక్షన్ లో రాబోతున్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం 2023 ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

హనుమాన్
10

రామాయణంలోని హనుమంతుని పాత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ టీజర్‌కు భారీ స్పందన లభించింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+