twitter

    RGV దెయ్యం స్టోరి

    RGV దెయ్యం సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో డా రాజశేఖర్, స్వాతి దీక్షిత్త, సన, తనికెళ్ళ భరణి, బెనర్జీ, ఆహుతి ప్రసాద్, దేవదాస్ కనకాల, నేత చౌదరి, జీవ ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ వహించారు. 

    కథ

    మెకానిక్ గ్యారేజ్‌ను నడిపే శంకర్ (రాజశేఖర్) కూతురైన విజయ అలియాస్ విజ్జి (స్వాతి దీక్షిత్) కాలేజ్ స్టూడెంట్. శంకర్ జీవితం సక్రమంగా సాగుతున్న సమయంలో విజ్జి శరీరంలోకి గురు అనే వ్యక్తి ఆత్మ ప్రవేశిస్తుంది. దాంతో శంకర్ కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఈ క్రమంలో విజ్జి రూపంలో ఉన్న గురు పలు హత్యలకు పాల్పడుతుంటాడు. విజ్జి శరీరంలోకి గురు ఆత్మ ఎందుకు ప్రవేశించింది. తన శరీరంలోకి ఆత్మ ప్రవేశించిన తర్వాత విజ్జి చేసిన వీరంగం ఏమిటి? విజ్జి మానసిక పరిస్థితిని చూస్తూ శంకర్ అనుభవించిన మనోవేదన ఏమిటి? విజ్జి శరీరంలో చేరిన దెయ్యాన్ని బయటకు పంపించడానికి శంకర్ ఎలాంటి పాట్లు పడ్డాడు. చివరకు విజ్జి శరీరాన్ని దెయ్యం రూపంలో ఉన్న గురు వదిలాడా? విజ్జి రూపంలో ఉన్న దెయ్యం తన పగ, ప్రతీకారాన్ని ఎలా తీర్చుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే రాంగోపాల్ వర్మ రూపొందించిన దెయ్యం కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie RGV దెయ్యం with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X