రోబో సినిమా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, సంతానం, కరుణాస్, కలభవన్ మణి, డన్యా డెన్జొన్గ్ప, రఘవ్ రంగనాథన్, చొచిన్ హనీపా, దేవదర్శని తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రహమాన్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఓ ఫేమస్ సైంటిస్టు డా.వశి (రజినీకాంత్) కి ఓ లవర్ సన(ఐశ్వర్య రాయ్). ఓ ప్రక్క ఆమెతో ప్రేమ వ్యవహారం నడుపుతూ...ఎంతో కష్టపడి తయారుచేసిన శక్తివంతమైన రోబో చిట్టి(మళ్ళీ రజనీ). ఆ రోబోని సైన్యానికి అంకితమిచ్చి దేశభక్తి ని చాటుకోవాలనుకుంటాడు. అయితే విలన్ డా భోర(డానీ)కి ఆ రోబోని తీవ్రవాదులుకి అమ్ముకుని సొమ్ముచేసోవాలని ఉంటుంది. వీరి గొడవ ఇలా ఉంటే...రోబోకి విచక్షణా జ్ఞానం లేకపోతే సైన్యానికి సమస్య అవుతుందని ఇండియన్ ఆర్మి రిజక్టు చేస్తుంది. ఆ పరిస్ధితుల్లో వశి..మళ్లీ తన తెలివినంతా వినియోగించి ఆ రోబోకి భావోద్వేగాలు(ఎమోషన్స్) ని ఏర్పాటు చేస్తాడు. దాంతో ప్రతీ విషయానికి స్పందించటం మొదలెట్టిన రోబో...వెళ్ళి తనను సృష్టించిన వశి ..ప్రియురాలు సనతో ప్రేమలో పడుతుంది. కాదన్న వశిని ప్రక్కకు నెట్టి సనను కిడ్నాప్ చేస్తుంది. మరో ప్రక్క ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న విలన్ సైంటిస్టు దీన్నో అవకాశం తీసుకుని ఏం చేసాడు. చివరకు రోబో...ప్రేమ సఫలమయిందా అన్న ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే. నిజానికి ఈ ప్రశ్న కన్నా గ్రాఫిక్స్ తో రోబో ఎలా విన్యాసాలు చేసింది. ఏం వినాసనం తెచ్చిపెట్టిందన్నదే ఆసక్తి కరం.