X
రోబో

రోబో

Sci - Fi | 01 Oct 2010 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

రోబో స్టోరీ

రోబో సినిమా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ , సంతానం, కరుణాస్, కలభవన్ మణి, డన్యా డెన్జొన్గ్ప, రఘవ్ రంగనాథన్, చొచిన్ హనీపా, దేవదర్శని తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రహమాన్ స్వరాలు సమకుర్చారు. కథ ఓ ఫేమస్ సైంటిస్టు డా.వశి (రజినీకాంత్) కి ఓ లవర్ సన(ఐశ్వర్య రాయ్). ఓ ప్రక్క ఆమెతో ప్రేమ వ్యవహారం నడుపుతూ...ఎంతో కష్టపడి తయారుచేసిన శక్తివంతమైన రోబో చిట్టి(మళ్ళీ రజనీ). ఆ రోబోని సైన్యానికి అంకితమిచ్చి దేశభక్తి ని చాటుకోవాలనుకుంటాడు. అయితే విలన్ డా భోర(డానీ)కి ఆ రోబోని తీవ్రవాదులుకి అమ్ముకుని సొమ్ముచేసోవాలని ఉంటుంది. వీరి గొడవ ఇలా ఉంటే...రోబోకి విచక్షణా జ్ఞానం లేకపోతే సైన్యానికి సమస్య అవుతుందని ఇండియన్ ఆర్మి రిజక్టు చేస్తుంది. ఆ పరిస్ధితుల్లో వశి..మళ్లీ తన తెలివినంతా వినియోగించి ఆ రోబోకి భావోద్వేగాలు(ఎమోషన్స్) ని ఏర్పాటు చేస్తాడు. దాంతో ప్రతీ విషయానికి స్పందించటం మొదలెట్టిన రోబో...వెళ్ళి తనను సృష్టించిన వశి ..ప్రియురాలు సనతో ప్రేమలో పడుతుంది. కాదన్న వశిని ప్రక్కకు నెట్టి సనను కిడ్నాప్ చేస్తుంది. మరో ప్రక్క ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న విలన్ సైంటిస్టు దీన్నో అవకాశం తీసుకుని ఏం చేసాడు. చివరకు రోబో...ప్రేమ సఫలమయిందా అన్న ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే. నిజానికి ఈ ప్రశ్న కన్నా గ్రాఫిక్స్ తో రోబో ఎలా విన్యాసాలు చేసింది. ఏం వినాసనం తెచ్చిపెట్టిందన్నదే ఆసక్తి కరం.
Read More

రోబో కాస్ట్ & క్రూ

రోబో సిబ్బంది సమాచారం

దర్శకత్వం శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత కళానిధి మారన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రోబో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రజనీకాంత్..సైన్స్ ఫిక్షన్...నిజానికి ఈ రెండూ ఒకదానికొకటి పొంతన కుదవనిపిస్తాయి. ఎందుకంటే రజనీ మాస్ కి మంత్రమైతే, సైన్స్ ఫిక్షన్..క్లాస్ కి తంత్రం. ఈ రెండూ కలగపిన మాంత్రికుడు శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అని రోబో కోసం రెండు ఏళ్ళుగా జనం ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు గ్రాఫిక్స్ రూపంలో పెద్ద ప్రతిఫలం దక్కింది. అయితే కథా పరంగా చిన్న చూపే మిగిలింది. రజనీ కాంత్ ద్విపాత్రల్లో అద్వితీయంగా చేసిన ఈ చిత్రాన్ని ఇండియన్ తెరపై చేసిన ఇంద్రజాలం అనటంలో సందేహం లేదు. కానీ కథలో నెగిటివ్ హీరోగా ఉన్న రోబో...పాజిటివ్ హీరో సైంటిస్టుని డామినేట్ చేయటం, అతనికి సీన్స్, సీన్ లేకుండా చేయటం ఇబ్బందికర అంశం. అయితేనేం కూర్చున్నంతసేపూ ఓ హాలీవుడ్ చిత్రం చూస్తున్న ఫీల్ తెచ్చిన దర్శకుడుని,టెక్నికల్ టీమ్ ని అభినందించకుండా ఉండలేం.

రోబో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రోబో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+