రౌడీ ఫెలో సినిమా ఒక యాక్షన్, కామిడి, డ్రామా మరియు రోమాన్స్ మిళితమైన ఎంటర్టైనర్ చిత్రం ఇందులో
నారా లోహిత్,
విశాఖ సింగ్, నందిని రాయి మరియు రావు రమేష్, పొసాని క్రిష్ణ మురళి, పరుచురి బ్రదర్ వీళ్ళందరు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకు దర్సకత్వం క్రిష్ణ చైతన్య నిర్వహిస్రున్నారు, నిర్మాత ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీతదర్సకుడు సన్ని స్వరాలు అందించారు.
కథ
డబ్బుతో పాటు బోలెడంత ఇగో ఉన్న కుర్రాడు రానా ప్రతాప్ జయదేవ్(నారా రోహిత్). అతని ఈగోని ఎవరన్నా హర్ట్ చేస్తే వారిని తిరిగి దెబ్బకొట్టేడానికి ఎంతదూరం అయినా వెళ్లే రకం. అమెరికానుంచి వచ్చిన రానా కి...ఓ రోజు అనుకోని పరిస్దితిలో ఓ పోలీస్ ఆఫీసర్ పరమహంస (ఆహుతి ప్రసాద్) తో గొడవపడి ఇగో దెబ్బతింటుంది.
దాంతో పోలీస్,పొలిటికల్ పవర్ తో తనను దెబ్బ కొట్టాడని అదే డిపార్టమెంట్ లో చేరి, తిరిగి అతనికి బుద్ది చెప్దామనుకుంటాడు. అందులో భాగంగా ఏలూరు దగ్గరలోని కొల్లేరులో ఉద్యోగం వేయించుకుంటాడు. అయితే అక్కడకి వెళ్లే సరికి సీన్ వేరే రకంగా ఉంటుంది. కొల్లేరు ప్రాంతాన్ని అక్కడ ఎంపి దుర్గా ప్రసాద్(రావు రమేష్) ఏలుతూంటాడు. ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు,అక్కడ జరిగుతున్న అరాచకాలు, జర్నలిస్ట్ మిస్సింగ్ వంటివి చూసిన రానా ఏం చేసాడు... అతను ప్రేమలో పడిన మేఘ(విశాఖ సింగ్) ఎవరు... అతని ఇగో తృప్తి పొందిందా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.