విమర్శకుల సమీక్ష

  • దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించే సైనికుల జీవితాలను హైలెట్ చేస్తూ రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఓ ఫ్యాక్షన్ చిత్రంగా మారింది. మహేష్ బాబు, విజయశాంతి, ప్రకాశ్ రాజ్ ఫెర్ఫార్మెన్స్‌తో పాటు రష్మిక గ్లామర్, పదునైన డైలాగ్స్ సినిమాలో ఆకట్టుకొనే అంశాలు. దేశభక్తిని గుర్తు చేసే విధంగా రాసుకొన్న సన్నివేశాలు ఫ్యాన్స్‌ను సంతృప్తిపరుస్తాయి. కాకపోతే ఫస్టాఫ్ మంచి ఊపుతో సాగిన ఈ చిత్రం సెకండాఫ్ కొచ్చే సరికి నీరసపడినట్టు కనిపిస్తుంది. కాకపోతే ప్రీ క్లైమాక్స్‌లో కొన్ని సీన్లు మళ్లీ జోష్‌ను నింపేలా చేస్తాయి. ఓవరాల్‌గా ఫ్యాన్స్‌ను మాత్రం ఆలరించే విధంగా ఉన్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో రిలీజైనందున భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయం. ఇక బీ, సీ సెంటర్లలో ఇతర సినిమాల పోటీని తట్టుకొని నిలకడగా కలెక్షన్ల సాధిస్తే రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X