X
సరిలేరు నీకెవ్వరు
Action | 11 Jan 2020 | U/A | 166 Mins
Telugu

సరిలేరు నీకెవ్వరు స్టోరీ

సరిలేరు నీకెవ్వరు సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇందులో మహేష్ బాబు, రష్మిక మందన్న, విజయ శాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, అజై, జయప్రకాష్ రెడ్డి, రఘు బాబు, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెలకిశోర్, సంగీత క్రిష్, హరితేజా, తమన్న భాటియా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శక్వం అనిల్ రావిపూడి వహించారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.

కథ

ఎవరూ లేని అనాధ అయిన అజయ్ (మహేష్‌ బాబు) సైన్యంలో ధైర్య సాహసాలకు మారు పేరైన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఓ ఆపరేషన్‌లో తన తోటి జవాను గాయపడటంతో అతడి బాధ్యతలను తీర్చడానికి అజయ్ కర్నూలు వెళ్లాల్సి వస్తుంది. కర్నూలులో అడుగు పెట్టిన మరుక్షణమే తన తోటి జవాను తల్లి, ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) ఓ సమస్యలో కూరుకుపోవడం అజయ్ తెలుసుకొంటాడు. మంత్రి నాగేంద్ర (ప్రకాశ్ రాజ్) ప్రైవేట్ సైన్యం అజయ్‌ను టార్గెట్‌గా చేసుకొంటుంది. తన సహచర జవాను అజయ్ (సత్యదేవ్)‌కు ఉన్న బాధ్యత ఏమిటి? కర్నూలులో భారతికి ఎలాంటి సమస్య ఎదురైంది. మంత్రి నాగేంద్రతో భారతికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? అజయ్ (మహేష్‌) కర్నూలులో భారతికి ఎలా అండగా నిలిచాడు. భారతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని, లోటును అజయ్ ఎలా పూడ్చాడు. ఇలాంటి భావోద్వైగమైన కథలో సంస్కృతి (రష్మిక మందన్న) చిలిపి, అల్లరి పనులు ఎలా సినిమాకు వినోదాన్ని పంచాయి? అజయ్, సంస్కృతి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడింది. మంత్రి నాగేంద్రకు అజయ్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే సరిలేరు నీకెవ్వరు సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+