సారొచ్చారు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ, జయసుధ, చంద్రమోహన్, రవిప్రకాష్, యం.ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి కథ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: పరుశరామ్ నిర్వహించారు మరియు నిర్మాత ప్రయాంక దత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
సంధ్య(కాజల్) పూర్తిగా కార్తిక్(రవితేజ)తో ఒన్ సైడ్ లవ్ లో పడిపోయి ఓ రోజు ప్రపోజ్ చేస్తుంది. అయితే అతను తనకు అంతకుముందే వసు(రిచా గంగోపాధ్యాయ)తో ప్రేమ వివాహం జరిగిందని, కానీ పెళ్లికి ముందు చూపించినంత ప్రేమను తర్వాత భాథ్యతలు, కెరీర్ ఒత్తిడిలో పడి తాను చూపించలేకపోతున్నాను అంటూ తన భార్య కోపంతో విడిపోయి విడాకులకు అప్లై చేసిందని.. తన గతం చెప్తాడు. అతని ప్రేమ వివాహం కథ విన్న సంధ్య షాక్ అవుతుంది. అయినా అతనిపై ప్రేమను వదులుకోలేకపోతుంది. అప్పుడు కార్తీక్ మరో ఊహించని ట్విస్ట్ రివిల్ చేస్తాడు.... ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి... సంధ్య, వసు ప్రేమ కథ ముగింపుకి ఎలా వచ్చింది. సంధ్య పరిస్ధితి ఏమిటి.... అలాగే ఈ సినిమాలో గౌతమ్(నారా రోహిత్) పాత్ర ఏమిటి.. తెలియాలంటే... చిత్రం చూడాల్సిందే.