సెబాస్టియన్ పిసి524 (2022)(U/A)
Release date
04 Mar 2022
genre
సెబాస్టియన్ పిసి524 స్టోరి
సెబాస్టియన్ పిసి524 సినిమా కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కిరణ్ అబ్బవరం, నమ్రత దారేకర్, కోమలీ, రోహిణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలాజీ సయ్యపురెడ్డి వహించారు. సంగీతం ఘిబ్రన్ అందించారు.
కథ
రేచీకటి వ్యాధితో బాధపడే సెబా అలియాస్ సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. అనేక బదిలీల తర్వాత మదనపల్లి పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీ చేస్తుండగా నీలిమా (కోమలి ప్రసాద్) అనే గృహిణి హత్యకు గురవుతుంది. అయితే తాను సరిగా డ్యూటీ చేయలేకపోవడం వల్లే నీలిమా చనిపోయిందనే బాధలో ఉన్న సెబా ఆమె మరణం వెనుక గుట్టును రట్టు చేయాలని అనుకొంటాడు. నీలిమా హత్య వెనుక వ్యక్తులను కనుక్కొనే క్రమంలో సెబాకు ఎదురైన సవాళ్లు ఏమిటి? సెబా దర్యాప్తుకు పై అధికారి అంబారామ్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎందుకు అడ్డు తగిలాడు? నీలిమా హత్య భర్త రాహుల్ (ఆదర్శ బాలకృష్ణ) పరిస్థితి ఏమిటి? నీలిమాకు తేజ (రాజా విక్రమ్)కు సంబంధం ఏమిటి? రేచీకటితో బాధపడే సెబాతో హేలీ (నువేక్ష) అఫైర్ ఎలా కొనసాగింది? నీలిమా మరణం విషయంలో ఆవేదన చెందుతున్న సెబాకు తల్లి మేరీ (రోహిణి) ఎలా సపోర్ట్‌గా నిలిచింది అనే ప్రశ్నలకు సమాధానమే సెబాస్టియన్ పీసీ 524 సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie సెబాస్టియన్ పిసి524 with us? Please send it to us ([email protected]).