షిరిడి సాయి సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, శ్రీకాంత్, శ్రీహరి, సాయికుమార్, కమలినిముఖర్జీ, తనికెళ్ల భరణి, శరత్‌బాబు, రోహిణి హట్టంగడి, వినయప్రసాద్, సాయాజీ షిండే, దేవేంద్ర దోడ్కే, బ్రహ్మానందం, కౌశిక్‌బాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ దర్శకత్వం: కె రాఘవేంద్రరావు నిర్వహించారు మరియు నిర్మాత: ఎ మహేశ్వర రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
తెలిసిన కథే మళ్లీ చెప్పుకుంటే 1854లో దత్తాతత్రేయుడు అవతారంగా సాయిబాబా ఉద్భవిస్తాడు. ఆయన తన పదహారోయేట శిరిడికి వస్తారు. అక్కడి వేప చెట్టు కింద కూర్చొంటారు. ఆయన తేజస్సుకి ఆకర్షితులైన ఊరి జనాల్ని చూసి ఆ ఊళ్లో పెద్ద మనిషి భాటియా(షాయేజీ షిండే)కి అసూయ వస్తుంది. అక్కడ నుంచి బాబాపై పగబట్టి ఆ ఊరునుంచి పంపేస్తాడు. ఆ తర్వాత మళ్లీ కొంత కాలానికి సాయిబాబా(నాగార్జున)గా అదే ఊరికి వస్తాడు. అప్పుడు మళ్లీ భాటియా పగని కంటిన్యూ చేస్తాడు. ఆయన్ని అన్ పాపులర్ చేసి, ఆ ఊరు నుంచి తరమటానికి ప్రయత్నం చేస్తూంటాడు. అయితే బాబా దాన్ని పట్టించుకోకుండా సబ్ కా మాలిక్ ఏక్ అనే సందేశాన్ని భోదిస్తూ తన ప్రస్దానం కొనసాగిస్తూంటాడు. ఆ క్రమంలో బోధనలు, మహిమలతో బాబా సమాధి అవటం వరకూ ఈ చిత్రం సాగుతుంది.