స్కంద సినిమా పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ పోతినేని, శ్రీ లీల తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం థమన్ ఎస్ అందిస్తున్నారు.
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. ముఖ్యంగా రామ్ మాస్ యాక్షన్‌కు సరిపోయే స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రామ్, బోయపాటి శ్రీను సినిమా తెరకెక్కనుంది.