X
సుబ్రహ్మణ్యపురం
Romance | 07 Dec 2018 | U/A |
Telugu

సుబ్రహ్మణ్యపురం స్టోరీ

సుబ్రహ్మణ్యపురం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇందులో సుమంత్, ఈషా రెబ్బ, సాయికుమార్, సురేష్, అమిత్ శర్మ, భద్రమ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం సంతోష్ జాగర్లమూడి మరియు సుధాకర్ రెడ్డి బీరం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర అందించారు.

 

కథ 
 
కార్తీక్(సుమంత్) పురాతన దేవాలయాల మీద రీసెర్చ్ చేసే ఒక పరిశోధకుడు. తన ప్రాజెక్టులో భాగంగా పూరి జగన్నాథ్ టెంపుల్‌తో పాటు వివిధ దేవాలయాలపై పరిశోధన చేస్తుంటారు. అయితే సుబ్రమ్మణ్యపురంలోని దేవాలయంలో జరిగే సంఘటనలు అతడిని విస్మయ పరుస్తుంటాయి. ఆ ఊరిలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిషేధం. అయితే ఓ వ్యక్తి స్వామికి అభిషేకం చేసి గుడిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అప్పటినుంచి ఆ ఊరిలో వరుస ఆత్మహత్యలు జరుగుతుంటాయి.
చనిపోయే వారికి ఎలాంటి బాధలు ఉండకపోగా అంతకు ముందు వరకు చాలా సంతోషంగా ఉండేవారు. నిరక్షరాస్యలు కూడా ఆత్మహత్య ముందు అతిపురాతనమైన గాంధార లిపిలో నన్ను దేవుడు పిలుస్తున్నాడు అని ఓ పేపర్ మీద రాసి ఆత్మహత్య చేసుకుంటారు. వారు చనిపోయే ముందు నెమలి కనిపించి మామవవ్వడం కూడా గ్రామస్తులను భయాంధోళనలకు గురి చేస్తూ ఉంటుంది. అభిషేకం జరుగడం వల్లే సుబ్రహ్మణ్య స్వామికి కోపం వచ్చిందని, అందుకే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని నమ్మిన గ్రామస్తులు మరిన్ని ఆత్మహత్యలు జరుగక ముందే ఊరి విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు.
అయితే దేవుడు అంటే నమ్మకం లేని, దేవాలయాల మీద పరిశోధన చేసే కార్తీక్ ఈ ఆత్మహత్యల వెనక ఉన్న రహస్యాన్ని ఎలా చేధించారు? ఇది దైవం చేస్తున్న పనా? లేక మనుషులు చేస్తున్నదేనా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+