సూపర్ మచ్చి (2022)(U/A)
Release date
14 Jan 2022
genre
సూపర్ మచ్చి స్టోరి
సూపర్ మచ్చి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ దేవ్, రియా చక్రవర్తి, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణమురళిలతో పాటు అజయ్, ప్రగతి, మహేష్, షరీఫ్, సత్యలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పులి వాసు వహించారు. ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.
కథ
ఎలాంటి బాధ్యత లేకుండా స్నేహితులతో జల్సాగా తిరుగుతూ బార్లో పాటలు పాడే యువకుడు రాజు (కల్యాణ్ దేవ్). రాజును ప్రేమించానని వెంటపడుతూ తిరిగే యువతి మీనాక్షి (రచిత రామ్) ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే మీనాక్షి పిచ్చిగా ప్రేమిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా రాజు ఆమె ప్రేమను తిరస్కరిస్తుంటాడు. అయితే మీనాక్షిని వదిలించుకోవడానికి ఒక రాత్రి గడిపితే నీ ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకొంటానని కండిషన్ పెడుతాడు. చదువు సంధ్య లేని రాజు ప్రేమ కోసం మీనాక్షి ఎందుకు తపించింది? ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? రాజును ప్రేమించడానికి కంటే ముందు చూడకుండా ప్రేమించిన వ్యక్తి ఎవరు? చూసుకోకుండానే ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన యువకుడిని ఎందుకు మీనాక్షి ఎందుకు వదులుకొన్నది? తండ్రి (రాజేంద్ర ప్రసాద్) చివరి కోరిక కోసం తన ప్రేమను త్యాగం చేసి.. రాజును పెళ్లి చేసుకోవాలనుకొన్నది? మీనాక్షిని తండ్రి కోరిన కోరిక ఏమిటి? ఇలాంటి మూడు కోణాలు ఉన్న ప్రేమకు ముగింపు ఏమిటి? మీనాక్షి, రాజు ఒక్కటయ్యారా? లేదా అజ్ఞాత ప్రేమికుడిని మీనాక్షి చేరువైందా? అనే ప్రశ్నలకు సమాధానమే సూపర్ మచ్చి సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie సూపర్ మచ్చి with us? Please send it to us ([email protected]).