X
తెలుగు » సినిమాలు » సూపర్ మచ్చి
సూపర్ మచ్చి

సూపర్ మచ్చి

Romance | 14 Jan 2022 | U/A | 132 Mins
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

సూపర్ మచ్చి స్టోరీ

సూపర్ మచ్చి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ దేవ్, రియా చక్రవర్తి, రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌ వీకే, పోసాని కృష్ణమురళిలతో పాటు అజయ్‌, ప్రగతి, మహేష్‌, షరీఫ్, సత్యలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పులి వాసు వహించారు. ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు.  కథ ఎలాంటి బాధ్యత లేకుండా స్నేహితులతో జల్సాగా తిరుగుతూ బార్‌లో పాటలు పాడే యువకుడు రాజు (కల్యాణ్ దేవ్). రాజును ప్రేమించానని వెంటపడుతూ తిరిగే యువతి మీనాక్షి (రచిత రామ్) ఇన్ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే మీనాక్షి పిచ్చిగా ప్రేమిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా రాజు ఆమె ప్రేమను తిరస్కరిస్తుంటాడు. అయితే మీనాక్షిని వదిలించుకోవడానికి ఒక రాత్రి గడిపితే నీ ప్రేమను అంగీకరించి పెళ్లి చేసుకొంటానని కండిషన్ పెడుతాడు. చదువు సంధ్య లేని రాజు ప్రేమ కోసం మీనాక్షి ఎందుకు తపించింది? ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన మీనాక్షిని రాజు ఎందుకు దూరంగా పెట్టాడు? రాజును ప్రేమించడానికి కంటే ముందు చూడకుండా ప్రేమించిన వ్యక్తి ఎవరు? చూసుకోకుండానే ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన యువకుడిని ఎందుకు మీనాక్షి ఎందుకు వదులుకొన్నది? తండ్రి (రాజేంద్ర ప్రసాద్) చివరి కోరిక కోసం తన ప్రేమను త్యాగం చేసి.. రాజును పెళ్లి చేసుకోవాలనుకొన్నది? మీనాక్షిని తండ్రి కోరిన కోరిక ఏమిటి? ఇలాంటి మూడు కోణాలు ఉన్న ప్రేమకు ముగింపు ఏమిటి? మీనాక్షి, రాజు ఒక్కటయ్యారా? లేదా అజ్ఞాత ప్రేమికుడిని మీనాక్షి చేరువైందా? అనే ప్రశ్నలకు సమాధానమే సూపర్ మచ్చి సినిమా కథ.
Read More

సూపర్ మచ్చి కాస్ట్ & క్రూ

సూపర్ మచ్చి సిబ్బంది సమాచారం

దర్శకత్వం పులి వాసు
సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు
సంపాదకుడు మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం తమన్ యస్
నిర్మాత రిజ్వాన్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సూపర్ మచ్చి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ప్రేమ, ఎమోషన్స్, ఫాదర్, డాటర్ సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్న చిత్రం సూపర్ మచ్చి. ఎలాంటి అశ్లీలత, బూతు, ద్వందార్థాలు లేని క్లీన్.. ఫెయిర్ చిత్రం సూపర్ మచ్చి. కథనం విషయాలో అక్కడక్కడా లోపాలు కనిపిస్తాయి. అది తప్పితే సినిమా ఎంటర్‌టైనింగ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్తే మంచి అనుభూతితో ప్రేక్షకుడు రావడం ఖాయమనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాతో కల్యాణ్ దేవ్ ద్వితీయ విఘ్నం దాటాడా? హిట్టును ఖాతాలో వేసుకొన్నాడా అనే విషయం కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

సూపర్ మచ్చి ట్రైలర్

Video Thumbnail

సూపర్ మచ్చి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

సూపర్ మచ్చి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+