స్వయంభూ మూవీ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిఖిల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ కృష్ణమాచారి వహిస్తున్నారు. నిర్మతలు భువన్, శ్రీకర్ కలిసి నిర్మిస్తున్నారు. స్వయంభూ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.
ఫస్ట్‌లుక్‌లో
ఫస్ట్‌లుక్‌లో నిఖిల్ పోరాట యోధుడిగా కనిపిస్తోన్నాడు. ఓ చేతిలో బళ్లెం, మరో చేతిలో షీల్డ్ ధరించి యుద్ధరంగంలో పోరాడుతోన్నట్లుగా ఉన్న నిఖిల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాంగ్ హెయిర్‌స్టైల్‌తో ఇప్పటివరకు కనిపించనటువంటి కొత్త లుక్‌లో నిఖిల్ కనిపిస్తోన్నాడు.