భారతీయ చలనచిత్ర చరిత్రలో పౌరాణిక సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మన తెలుగు సినిమాలు ఇతిహాసాలను,పురాణగాధ లను నిర్మించడంలో చరిత్ర సృష్టించారు.అప్పటి రామాయణ,భారత కధల నాధారంగా తీసిన కొన్ని చిత్రాలు ఇష్పుడు చూసినా అద్భుతంగా అనిపిస్తాయి.అప్పటి నటుల నటనా చాతుర్యం, ఉచ్ఛారణ, పురాణకాలాన్ని అనుభూతి చెందేలా చేసే గ్రాంధిక భాష,మధురమైన గీతాలు,నేర్పరులైన నర్తకీమణుల శాస్త్రీయ నృత్యాలు,కళ్ళు చెదిరే సెట్టింగులు ,ముఖ్యంగా దర్శకులు ఆ కధల మర్మం తెలుసుకుని... ఇవన్నీ కలిపితే ఈ చిత్రాలు గంటలు మనలని వేల వేల సంవత్సరాల వెనక్కి ఒక కాల్పనిక లోకానికి తీసుకునిపోయి 3 గంటలు కదలకుండా కట్టిపడవేస్తాయి.అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ అత్యుత్తమమైన టాప్ 7 తెలుగు పౌరాణిక చిత్రాలు.