తిమ్మరుసు సినిమా డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య దేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, రవి బాబు, అంకిత్ కొయ్య, ఝాన్సీ, అజయ్, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శరన్ కొప్పిశెట్టి వహించారు. నిర్మాతలు మహేష్ కోనేరు, సృజన యర్రబోలు కలిసి నిర్మించారు. సంగీతం శ్రీ చరణ్ పాకాల అందించారు.
కథ
న్యాయ వ్యవస్థలో టాప్ లాయర్‌గా కావాలని యువ లాయర్ రామ్ అలియాస్ రామ చంద్ర (సత్యదేవ్) కలలు కంటుంటాడు. అయితే ఎనిమిదేళ్ల క్రితం అరవింద్ (చైతన్య రావు మాదాడి) అనే క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో నిందితుడు వాసు (అంకిత్ కొయ్య) అనే యువకుడి కేసు వాదించడానికి సిద్ధమవుతాడు. తిమ్మరసు కథలో క్యాబ్ డ్రైవర్ అరవింద్ హత్య ఎందుకు జరిగింది? ఆ కేసులో పబ్‌లో పనిచేసే వాసుకు ఎందుకు శిక్ష పడింది. అరవింద్ హత్య కేసు, వాసు తరఫున లాయర్ ఎందుకు వాదించాలని నిర్ణయం తీసుకొంటాడు. ఈ కేసులో లాయర్ వాహనరావు (రవిబాబు), ఇన్స్‌పెక్టర్ భూపతి (అజయ్), మరో పోలీస్ అధికారి వాలి పాత్రలు ఏమిటి? ఇంకా బ్రహ్మాజీ, ప్రియాంక జవాల్కర్ పాత్రలు రాము చేసే ఇన్వెస్టిగేషన్‌కు ఎలా సహకరించాయి అనే ప్రశ్నలకు సమాధానమే తిమ్మరసు సినిమా కథ.