వాళ్ళిద్దరి మధ్య సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విరాజ్ అశ్విన్, నేహ కృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి ఎన్ అదిత్య వహించారు. అర్జున్ దాస్యం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మధు శ్రావంతి అందించారు.
కథ
బీటెక్ గ్రాడ్యుయేట్ వరుణ్ ఒక కారణంగా ఉద్యోగం చేయడం ఇష్టం లేక సొంతంగా అన్వయ అనే కంపెనీ ప్రారంభించి బిజినెస్ మొదలుపెడుతాడు. అమెరికాలో ఉండే అన్వయ అనే అమ్మాయి (నేహా కృష్ణ) తల్లిదండ్రులు వరుణ్‌కు క్లయింట్స్‌గా ఉంటారు. అయితే అన్వయ ఇంటికి వెళ్లిన వరుణ్ తొలి చూపులోనే ఆమెను చూసి ప్రేమిస్తాడు. అయితే అమెరికాలో బ్రేకప్ కావడంతో అన్వయ ఇండియాకు వచ్చిందని వరుణ్‌కు తెలుస్తుంది. అయినా అన్వయను ప్రేమిస్తుంటాడు. అయితే అయితే ఇక వాళ్లిద్దరు పెళ్లి చేసుకొంటారనే సందర్భంలో వారిద్దరి మధ్య అపార్ధాలు చోటుచేసుకొంటాయి. ఉద్యోగం చేయకుండా ఎందుకు వరుణ్ వ్యాపారం చేయాలనుకొంటాడు. తన తండ్రితో వరుణ్‌కు ఎందుకు విభేదాలు ఉంటాయి? అమెరికాలో నేహాకు ఎందుకు బ్రేకప్ అవుతుంది? పెళ్లి చేసుకొందామని అనుకొంటున్న సమయంలో నేహా, వరుణ్ మధ్య అపార్ధాలు చోటుచేసుకొంటాయి? నేహా, వరుణ్ మధ్య దూరం పెరగడానికి అసలు కారణం ఏమిటి? నేహా, వరుణ్ మధ్య అపార్ధాలను ఎవరు తొలగించారు? అనే ప్రశ్నలకు సమాధానమే వాళ్లిద్దరి మధ్య సినిమా కథ.