వరుడు కావలెను సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగశౌర్య, రీతువర్మ, నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష, అషు రెడ్డి, దేత్తడి హారిక తదితరులు నటించారు. దర్శకత్వం లక్ష్మి సౌజన్య గోపాల్ వహించారు . నిర్మాత నాగ వంశీ నిర్మించారు. సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు.
కథ
ప్యారిస్‌లో ఆకాశ్ (నాగశౌర్య) ఆర్కిటెక్ట్. ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న యాంత్రిక జీవితంపై విసుగుపుట్టి స్వదేశానికి రావాలని అనుకొంటాడు. కోట్ల రూపాయల ప్రాజెక్టును వదులుకొని ఇండియాకు వచ్చేస్తాడు. ఆ క్రమంలో ముక్కొపి, కెరీర్ తప్ప మరో విషయంపై దృష్టిపెట్టని భూమి (రీతూ వర్మ) రూపొందించే ఓ ప్రాజెక్ట్ కోసం ఆర్టిటెక్ట్‌గా చేరుతాడు. భూమి కట్టుబొట్టు, యాటిట్యూడ్ చూసి దగ్గరవుతాడు. అయితే ఆకాశ్ తన పట్ల చూపించే ప్రేమానురాగాల కారణంగా తన ప్రవర్తనను మార్చుకొంటుంది. ఈ క్రమంలో ఒకరినొకరు ప్రేమను వ్యక్తం చేసుకోవాలనుకొంటారు. కానీ ఓ విషయం వారి ప్రేమకు చిన్న జర్క్ ఇచ్చి వారి గతంలోకి తీసుకెళ్తుంది. అయితే ఆకాశ్ ప్రేమను భూమి అంగీకరించిందా? కోపం, పట్టుదల విషయంలో భూమి తన ప్రవర్తను ఎందుకు మార్చుకొన్నది? ఆకాశ్ తన ప్రేమను భూమికి వ్యక్తీకరించాడా? ఆకాశ్ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి? భూమి జీవితంలో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఆకాశ్, భూమి జీవితాలకు సంబంధించిన గత అనుభూతులు ఏమిటి? చివరకు భూమి, ఆకాశ్ ప్రేమకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే వరుడు కావలెను సినిమా కథ.