వెళ్ళిపోమాక సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వక్ సేన్, సుప్రజ, శ్వేత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అలీ మహ్మాద్ నిర్వహించారు మరియు నిర్మాత కె వి రాఘవ రెడ్డి, బాలరాజు పూరి, అలీ మహ్మాద్ కలిసి సంయుక్తంగ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి స్వరాలు సమకుర్చరు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో విడుదల చేస్తున్నారు.
కథ
వెళ్లిపోమాకే. టైటిల్ వింటుంటే.. ఇది ప్రేమకథ అని అర్థమైపోతోంది. అలాగే డైరెక్టర్ డిజైన్ చేశాడు కూడా. యానిమేషన్ లో మాంచి టాలెంట్ ఉన్న ఓ ఉద్యోగి.. తనను ఎవరైనా ప్రేమిస్తే బాగుంటుందని అనుకుంటాడు. తన ఆఫీస్ లోనే చేరిన ఓ అమ్మాయిపై మనసు పడతాడు. కానీ.. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి డీలా పడతాడు. అతడికి ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. కానీ.. తననుంచి అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వస్తుంది. అలా ఎందుకైంది? ఆ ఫేస్ బుక్ అమ్మాయిది తప్పా? లేదంటే హీరోది తప్పా? అనే విషయాన్ని తెర మీద చూడాల్సిందే..