X
Home టాప్ లిస్టింగ్

బోల్డ్ పాత్రల్లో మెప్పించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు

Author Administrator | Updated: Wednesday, June 14, 2023, 08:20 AM [IST]

హీరోయిన్స్ విష‌యంలో సిల్వ‌ర్ స్క్రీన్‌పై గ్లామ‌ర్‌గా మెప్పించ‌టం.. అందాల‌ను ఆర‌బోయ‌టం.. హీరోకి ధీటైన పాత్ర‌ల‌ను చేయ‌టం సాధార‌ణంగా జ‌రిగేదే. అయితే.. వాట‌న్నింటినీ మించి ఇమేజ్‌ను ప‌క్క‌కు పెట్టి వేశ్య త‌ర‌హా పాత్ర‌ల‌ను పోషించ‌టం అనేది మాత్రం అరుదైన విష‌యం. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందరో హీరోయిన్స్ వ‌చ్చారు.. వెళ్లారు. కానీ ఇలాంటి బోల్డ్ పాత్ర‌ల‌ను పోషించిన స్టార్స్ మాత్రం కొంద‌రే అలాంటి వారిలో...


cover image
అనుష్క శెట్టి
1

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న అనుష్క శెట్టి.. ‘వేదం’ సినిమాలో వేశ్య పాత్ర‌లో క‌నిపించింది. ఆసినిమా ఐదారు ప్ర‌ధాన పాత్ర‌ల చుట్టూ తిరుగుతుంది. అందులో ప్ర‌ధానంగా అల్లు అర్జున్‌, మ‌నోజ్ పాత్ర‌ల‌తో పాటు అనుష్క చేసిన పాత్ర ఆడియెన్స్‌కి గుర్తుండిపోయింది. 

చార్మి కౌర్
2

హీరోల స‌ర‌స‌న ఆడిపాడిన చార్మి కౌర్‌.. ఉన్న‌ట్లుండి నిర్మాత‌గా మారి ద‌ర్శ‌కుడి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన చిత్రం ‘జ్యోతీల‌క్ష్మి’. ఇందులో పాత్రానుగుణంగా బోల్డ్‌గా చేసిన‌ చార్మి న‌ట‌న‌కు మంచి అప్రిషియేష‌న్స్ వ‌చ్చాయి. 

అనసూయ భరద్వాజ
3

స్టార్ యాంక‌ర్ నుంచి సిల్వ‌ర్ స్క్రీన్‌పై న‌టిగా ఎంట్రీ ఇచ్చిన అన‌సూయ ఇప్పుడు కీల‌క‌మైన రోల్స్ చేస్తుంది. తాజాగా ఆమె ‘విమానం’ సినిమాలో వేశ్య పాత్ర‌లో న‌టించింది. ఆమె కెరీర్‌లో ఇదొక మెమ‌ర‌బుల్ మూవీగా విమానం నిలిపోయింది. 

శ్రియ సరన్
4

ఇప్ప‌టికీ హీరోయిన్‌గా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న శ్రియా శ‌ర‌న్‌.. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌టానికి ఎప్పుడూ సిద్ధ‌మేనంటుంది. అందులో భాగంగా ‘పవిత్ర’ సినిమాలో వేశ్య‌గా న‌టించింది.  ఓ స్టార్ హీరోయిన్ అలాంటి పాత్ర‌లో న‌టించ‌టం అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా మారింది. 

అర్చన వేదశాస్త్రి
5

తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అర్చ‌న అలియాస్ వేద ‘కమలతో నా ప్రయాణం’ చిత్రంలో బోల్డ్ పాత్ర‌లో న‌టించింది. క‌థ న‌చ్చ‌డంతో సెకండ్ థాట్ లేకుండా అలాంటి బోల్డ్ పాత్ర‌లో న‌టించ‌టానికి రెడీ అయ్యానంటూ ఆమె అప్ప‌టి ఇంట‌ర్వ్యూస్ చెప్పింది. 

హరిప్రియ
6

‘పిల్ల జమీందార్’ చిత్రంలో నటించి హిట్ కొట్టి అందరి దృష్టిని ఆక‌ర్షించిన హీరోయిన్ హ‌రి ప్రియ‌. త‌ర్వాత తెలుగుతో పాటు క‌న్న‌డంలో ప‌లు చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ చిత్రంలో ఆమె వేశ్య పాత్ర‌లో న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 

శోభితా ధూళిపాల
7

మ‌ణిర‌త్నం వంటి ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేస్తూ ఇటు ద‌క్షిణాది, అటు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాల‌. ఆమె తెలుగులో చేయ‌లేదు కానీ.. మ‌ల‌యాళంలో న‌వీన్ పౌలీ హీరోగా న‌టించిన  ‘మూతాన్’లో వేశ్య పాత్రలో నటించి ఆకట్టుకుంది. 

సంగీత క్రిష్
8

ఈ అబ్బాయి చాలా మంచోడు, ఖ‌డ్గం వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న సంగీత‌.. తెలుగుతో పాటు త‌మిళంలోనూ చాలా చిత్రాల్లో న‌టించి మెప్పించింది. ఆమె ‘దానం’ అనే చిత్రంలో బోల్డ్ పాత్ర‌లో త‌న‌దైన యాక్టింగ్‌తో మెప్పించింది. 

బిందు మాధవి
9

‘అవ‌కాయ్ బిర్యాని’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన బిందు మాధ‌వి. తెలుగులోనే కాకుండా త‌మిళంలోనూ హిట్ చిత్రాలు చేసింది. బిగ్ బాస్ ఓటీటీలోనూ ఆమె విన్న‌ర్‌గా నిలిచింది. ఆమె నాని హీరోగా న‌టించిన ‘సెగ’ చిత్రంలో కాల్ గ‌ర్ల్ పాత్ర‌లో న‌టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+