వాట్ ది ఫిష్ (మనం మనం బరంపురం) డార్క్ కామెడీ-హై ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్ తదితరులజు నటిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వరుణ్ కోరుకుండా వహిస్తున్నారు. 6ix సినిమాస్ భారీ స్థాయిలో నిర్మించనుంది.
ఈ మూవీ షూటింగ్ 75 రోజుల పాటు బ్యూటిఫుల్ టొరంటో, కెనడా సిటీలోని వివిధ లొకేషన్లలో జరగనుంది. ఈ సినిమాకు పనిచేస్తు్న్న టాలెంటెడ్ టాలీవుడ్ యాక్టర్స్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాత నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను రాబోయే రోజుల్లో వెల్లడించనున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.