వైఫ్ ఆఫ్ రామ్ సినిమా సస్పెన్స్, థ్రిల్లింగ్, ఎమోషన్స్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు లక్ష్మి, సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ ఏలకంటి వహించారు మరియు నిర్మాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రఘు దీక్షిత్ అందించారు.
కథ
దీక్ష(మంచు లక్ష్మీ) స్వచ్ఛంద సంస్థలో పనిచేసే ఉద్యోగి. ఊహించని పరిస్థితుల్లో తన భర్త (సామ్రాట్) ప్రమాదవశాత్తూ మరణిస్తాడు. తన భర్త మరణానికి కారణం ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసుల సహకారం కోరుతుంది. కానీ తాను ఆశించినట్టు వారి నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఈ క్రమంలో తనదైన శైలిలో ఆధారాలు సేకరించే పనిలో పడుతుంది. ఈ క్రమంలో రాకీ (ఆదర్శ్) కారణం అని తెలుస్తుంది.
తన భర్త ఎందుకు హత్యకు గురయ్యాడు? ఎవరు హత్య చేశారు? తన భర్త మరణం వెనుక అసలు కారణం ఏమిటి? దీక్ష పోరాటానికి న్యాయం జరిగిందా? తన ప్రయాణంలో దీక్ష ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? పోలీసులుఎందుకు సహకరించరు? రాకీపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నది? ఇలాంటి ప్రశ్నలకు సస్పెన్స్ వీడాలంటే వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చూడాల్సిందే.