యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇందులో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్ర పోషిస్తున్నారు ఇంకా తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వి రాఘవ వహిస్తున్నారు మరియు నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కథ :
యాత్ర సినిమా గురించి చెప్పుకోవడానికి కథ ఏమీ ఉండదు. ఓ సుదీర్ఘమైన జీవన ప్రయాణం మాత్రమే కనిపిస్తుంది. అధికారంలో ఉన్న అత్యంత బలమైన ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ ఒంటరిగా ఎదురిస్తూ ప్రజా సమస్యలను ఎలా తెలుసుకొన్నాడనేది యాత్ర సినిమా. అన్ని సినిమాల్లో మాదిరిగా బలమైన ప్రత్యర్థులు ఈ సినిమాలో కనపించరు. కాకపోతే పాదయాత్రలో ప్రజల కష్టాలను గుర్తెరిగి మహానేతగా ఎలా మారాడన్నది ఈ చిత్ర కథ.
మహానేతగా మారే క్రమంలో తాను మారిన విధానం, అంతేకాక మంచి కోసం ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదురించే వైఎస్ఆర్ గుండె నిబ్బరం. పేద ప్రజల కోసం పడే ఆరాటం, పేద ప్రజలు, రైతుల ఆవేదనను అర్ధం చేసుకొనే వైఎస్ గుండెచప్పుడు తెర మీద స్పష్టం కనిపిస్తుంది. 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో వైఎస్ ఎలాంటి అవమానాలకు గురయ్యాడు? ఎలాంటి కష్టాలను అనుభవించాడు. అధికారంలోకి కాంగ్రెస్‌ను ఎలా తీసుకొచ్చాడనే విషయాలను అత్యంత భావోద్వేగంగా తెర మీద ఆవిష్కరణ జరిగింది.