»   » బట్టలు కూడా లాగేసుకుంటారా? యాంకర్ రవి సంచలన కామెంట్స్!

బట్టలు కూడా లాగేసుకుంటారా? యాంకర్ రవి సంచలన కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి మల్టీప్లెక్సులు, కొన్ని థియేటర్ల యాజమాన్యాలు టికెట్ తో పాటు బలవంతంగా ఫుడ్ అండ్ బేవరేజెస్ టోకెన్లు అంటగడుతున్నారంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాల నేపథ్యంలో యాంకర్ రవి సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. "ఆలోచించకుండా... ఎంత అడిగితే అంత ఇస్తున్నాము!! ఐ ఫీల్ దే ఆర్ లూటింగ్ అజ్ ఫ్రెండ్స్...బ్రెడ్ ముక్క, కొంచెం చీజ్, రెండు టొమాటో మరియు కీర ముక్కల శాండ్‌విజ్ 70 రూపాయలు. పాప్‌కార్న్ 3 వందల నుంచి 350 రూపాయలంట.. వాటర్ బాటిల్ 40 రూపాయలు. మల్టీ‌ప్లెక్స్‌ లలో ఫుడ్‌ కాస్ట్ పరిస్థితి ఇది అంటూ యాంకర్ రవి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

బట్టలు కూడా లాగేసుకోవడం దారుణం

వాలెట్ నుంచి డబ్బులు తీసుకోవడం వ్యాపారం... బట్టలు కూడా లాగేసుకోవడం దారుణం!! డూ యూ ఎగ్రీ?" అంటూ రవి పెట్టిన పోస్టుకు మంచి స్పందన వస్తోంది. ఆయనకు మద్దతుగా లైకులు, షేర్స్, కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, సినీ ప్రియులు.

మెగాస్టార్ సపోర్టుతో... హీరోగా యాంకర్ రవి మూవీ (ఫోటోస్)

మెగాస్టార్ సపోర్టుతో... హీరోగా యాంకర్ రవి మూవీ (ఫోటోస్)

టీవీ యాంకర్ రవి త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రవి కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం పేరు ‘ఇది మా ప్రేమకథ'. ‘1 ఈజ్‌ గ్రేటర్‌ దెన్‌ 99' ఉపశీర్షిక. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి దీన్ని లాంచ్ చేసారు. పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

నా జన్మ ధన్యమైంది, మా నాన్న కూడా.... సన్నీ లియోన్‌‌‌తో యాంకర్ రవి!

నా జన్మ ధన్యమైంది, మా నాన్న కూడా.... సన్నీ లియోన్‌‌‌తో యాంకర్ రవి!

నా జన్మ ధన్యమైంది, మా నాన్న కూడా మీ ఫ్యాన్ అంటూ.... సన్నీ లియోన్‌‌‌తో ముందు యాంకర్ రవి మోకరిల్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఇప్పటికైనా మారండి: శ్రీనివాస్ హత్యపై యాంకర్ రవి కామెంట్స్!

ఇప్పటికైనా మారండి: శ్రీనివాస్ హత్యపై యాంకర్ రవి కామెంట్స్!

భారతీయుడు, తెలుగువాడైన కూచిబొట్ల శ్రీనివాస్ ఇటీవల అమెరికాలో జాత్యహంకారి కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై యాంకర్ రవి స్పందించిన తీరు కాస్త వివాదాస్పదం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"Alochinchakunda...entha adigithe antha isthunaamu!! I feel they'r looting us friends :( bread mukka, koncham cheese, rendu tomato n kheera mukkala sandwich 70 rupees :( Popcorn 300 to 350 rupees anta & water 40 rupees :( multiplexes lo food cost paristhithi idhi..."wallet nunchi dabbulu theesukovadam vyapaaram, battalu kuda laagesukovadam dhaarunam"!! Do u agree?" Anchor Ravi posted in FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu