»   » నా జన్మ ధన్యమైంది, మా నాన్న కూడా.... సన్నీ లియోన్‌‌‌తో యాంకర్ రవి!

నా జన్మ ధన్యమైంది, మా నాన్న కూడా.... సన్నీ లియోన్‌‌‌తో యాంకర్ రవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రోగ్' ఆడియో వేడుక సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో వేడుకలో శృంగార తార సన్నీ లియోన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఆడియో వేడుకకే హైలెట్ అయింది.

శృంగార దేవతగా, స్వప్న సుందరిగా కొలిచే సన్నీ లియోన్‌ను 'రోగ్' ఆడియో వేడుక ద్వారా నేరుగా చూసే అవకాశం కల్పించిన పూరి జగన్నాథ్ కు అభిమానులు థాంక్స్ చెబుతున్నారు. ఇక ఈ ఆడియో వేడుకకు యాంకరింగ్ చేసిన రవి.... సన్నీ లియోన్ ను ఇంత దగ్గరగా చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

నా జన్మ ధన్యమైందన్న రవి

నా జన్మ ధన్యమైందన్న రవి

సన్నీ లియోన్‌ను ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు. కలలో కూడా ఊహించలేదు. నా జన్మధన్యమైంది. ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా మీ అంత అందంగా ఉండదు, ప్రతి మగాడి జీవితంలో నువ్వొక ఏంజల్ అంటూ సన్నీ లియోన్ ను పొగడ్తలతో ముంచెత్తాడు యాంకర్ రవి.

మా నాన్న కూడా సన్నీ లియోనాయనమ:

మా నాన్న కూడా సన్నీ లియోనాయనమ:

మా నాన్నకు కూడా సన్నీ లియోన్ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో అమ్మతో నాన్న గొడవ పడితే రిలాక్స్ కావడానికి ఓం సన్నీ లియోనాయ నమ: అనేస్తారు అంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చారు.

rn

సన్నీ లియోన్ ను చూసేందుకు

సన్నీ లియోన్ ను చూసేందుకు ‘రోగ్' ఆడియో వేడుకకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. భారీగా అభిమానులు తరలివస్తారనే కారణంతోనే జేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆడియో వేడుక ఏర్పాటు చేసారు.

rn

పూరి గురించి సన్నీ

స‌న్నిలియోన్ మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ చూశాను. చాలా బావుంది. పూరిగారు టేకింగ్ బావుంది. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంఉన్నాను`` అన్నారు.

 రోగ్

రోగ్

యంగ్‌ హీరో ఇషాన్‌ హీరోగా మన్నారాచోప్రా, ఏంజెలినా హీరోయిన్స్‌గా జయాదిత్య సమర్పణలో తాన్వి ఫిలింస్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.ఆర్‌. మనోహర్‌, సి.ఆర్‌. గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం 'రోగ్‌'. మరో చంటిగాడి ప్రేమకథ అనేది క్యాప్షన్‌. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించారు. ఆడియో వేడుకలో ఈ కార్య‌క్ర‌మంలో పూరి జ‌గ‌న్నాథ్‌, వి.వి.వినాయ‌క్‌, హీరో ఇషాన్‌, ఎంజెలా, సునీల్ క‌శ్య‌ప్‌, భాస్కర భ‌ట్ల‌, డైరెక్ట‌ర్ క్రిష్‌, సాయిరాం శంక‌ర్‌, ఆకాష్ పూరి, రోష‌న్‌, అర్బాజ్ ఖాన్‌, మ‌న్నార్ చోప్రా, క‌షిష్ వోరా, నికిత, అలీ, ప్ర‌సాద్ వి.పొట్లూరి, సుబ్బ‌రాజు, ఎ.ఎం.ర‌త్నం, ఎహ్‌జాజ్ ఖాన్‌, స‌త్యానంద్‌, సంజ‌న‌, వి.ఆనంద్ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

English summary
Rogue is an upcoming movie of director Puri Jagannadh and he is introducing a new hero named Ishaan to the industry, audio of this movie is launched monday. Sunny Leone has perfomed in live on the stage of this audio launch event and watch the video to have a glimpse at it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu