»   » శ్రీవారి సన్నిధిలో శ్రీమతితో జూ ఎన్టీఆర్ (ఫోటోస్)

శ్రీవారి సన్నిధిలో శ్రీమతితో జూ ఎన్టీఆర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంగళవారం తెల్లవారు ఝామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ తో పాటు ఆయన భార్య లక్ష్మి ప్రణతి, దర్శకుడు కొరటాల శివ శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు, సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఎన్టీఆర్, కొరటాల కలిసి చేసిన 'జనతా గ్యారేజ్' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొక్కు తీర్చుకోవడంలో భాగంగానే ఇద్దరూ తిరుమల వచ్చినట్లు సమాచారం.

బిజీ బిజీ

బిజీ బిజీ

ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ మహేష్ బాబు హీరోగా ‘భరత్ అను నేను' అనే చిత్రం చేస్తున్నారు.

మరో మూవీ

మరో మూవీ

భవిష్యత్తులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో వీరి తర్వాతి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

లవ కుశ

లవ కుశ

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హీరోగా ‘జై లవ కుశ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈచిత్రానికి సంబంధించిన విశేషాల కోసం క్లిక్ చేయండి.

కొరటాల శివ

కొరటాల శివ

కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ‘భరత్ అను నేను' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Jr NTR and Pranathi Visit Tirumala along with Siva Koratala. Check out full details here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu