»   » మహేష్ బాబు-కొరటాల మూవీ హీరోయిన్ ఖరారు...ఈవిడే (ఫోటోస్)

మహేష్ బాబు-కొరటాల మూవీ హీరోయిన్ ఖరారు...ఈవిడే (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి 'భరత్ అనే నేను' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు.

ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన్లను పరిశీలించిన కొరటాల శివ... చివరకు బాలీవుడ్ నటి కియారా అద్వానిని ఫైనల్ చేసారు. ఈ బ్యూటీ ఎంఎస్.ధోని బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కియారా

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కియారా

కియారా 2014లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఇప్పటి వరకు ఆమె చేసింది మూడు సినిమాలు మాత్రమే. తొలి మూవీ ఫగ్లీ పెద్దగా ఆడలేదు. ఈ ఏడాది వచ్చిన మెషీన్ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేక పోయింది. ఆమెకు గుర్తింపు తెచ్చిన ఒకే మూవీ ‘ఎంఎస్ ధోనీ' బయోపిక్. ఇపుడు ఏకంగా మహేష్ బాబు సినిమాలో చాన్స్ కొట్టేసింది. ఇందులో ఆమె క్లిక్ అయితే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవచ్చు.

ఎవరీ కియారా

ఎవరీ కియారా

కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ. వయసు 24. 1992లో ముంబైలో పుట్టింది. కైరా ఫాదర్ జగదీప్ అద్వానీ ఓ బిజినెస్ మేన్. 2009లో 3 ఇడియట్స్ సినిమా చూసిన తర్వాత తన పిల్లలను కూడా సినిమాల్లోకి పంపించాలని నిర్ణయించుకున్నారట. కైరా అద్వానీ హాట్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

ప్రీ పొడక్షన్

ప్రీ పొడక్షన్

కొరటాల శివ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. కొరటాల, దేవిశ్రీ కలిసి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ బిజీగా ఉన్నారు. తమకు నచ్చిన విధంగా, మహేష్ అభిమానులు, ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ పాటల కంపోజింగ్ జరుగుతోందట. రెండు మెలొడీ సాంగ్స్, రెండు మాస్ సాంగ్స్, ఓ ఐటం సాంగ్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం.

షూటింగ్ ఎప్పుడంటే..

షూటింగ్ ఎప్పుడంటే..

భరత్ అనే నేను సినిమాకు సంబంధించిన షూటింగ్ మే నెల చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో అందుకు తగిన విధంగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

English summary
It is known that Mahesh Babu and Koratala Siva have joined hands again after 'Srimanthudu'. This time, They will be working for a subject titled as 'Bharath Ane Nenu'. Reportedly, Koratala Siva preferred signing upcoming Bollywood actress Kiara Advani who shot to fame with 'MS Dhoni: The Untold Story'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu