»   » బిగ్ అనౌన్స్‌మెంట్: పెళ్లి డేట్ ప్రకటించిన నాగ చైతన్య-సమంత!

బిగ్ అనౌన్స్‌మెంట్: పెళ్లి డేట్ ప్రకటించిన నాగ చైతన్య-సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తన పెళ్లి డేట్ ప్రకటించారు. బుధవారం ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొన్న నాగ చైతన్య.... ఈ సందర్భంగా వివాహ తేదీ ప్రకటించారు.

అక్టోబర్ 6వ తేదీన సమంతతో తన వివాహం జరుగబోతోందని, పెళ్లి ఇండియాలోనే జరుగుతుందని, తమది డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. నాగ చైతన్య ఈ ప్రకటన చేయగానే పలువురు అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతూ కామెంట్లతో ముంచెత్తారు.

రెండు సాంప్రదాయాల్లో వివాహం

రెండు సాంప్రదాయాల్లో వివాహం

ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో.... రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం జరుగుతుందని, హిందూ, క్రైస్త‌వ‌ సంప్రదాయాల ప్రకారం స‌మంత‌తో త‌న పెళ్లి మ‌న‌ దేశంలోనే జరుగుతుందని నాగ చైతన్య స్పష్టం చేశాడు.

సమంత గురించి

సమంత గురించి

స‌మంత త‌న‌ అభిరుచుల్ని గమనించి తనను ప్రోత్సహిస్తుందని, అదే సమయంలో తాను కూడా స‌మంత‌ అభిరుచుల విషయంలో అలాగే ఉంటాన‌ని చెప్పాడు. అన్ని విషయాల్లో ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టే తమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందన్నారు.

అల్లరి పిల్లే, కానీ మంచి అమ్మాయి

అల్లరి పిల్లే, కానీ మంచి అమ్మాయి

సమంతతో తన‌కు ఏడేళ్లుగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఇద్దరం ఒకరిగురించి ఒకరం బాగా అర్థం చేసుకున్నామని తెలిపారు. స‌మంత ఓ మంచి అమ్మాయని అన్నాడు. అలాగే అల్లరి అమ్మాయి అని కూడా నాగ చైతన్య అన్నారు.

తీపి గుర్తులు

తీపి గుర్తులు

త‌మ తొలి పరిచయం నుండి.... తమ మధ్య కొనసాగిన స్నేహం, ప్రేమ ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని తీపిగుర్తులుగా త‌న మ‌దిలో ఉండిపోతాయని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

బికినీ పిక్ పోస్టు చేసిన సమంత.... అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్!

బికినీ పిక్ పోస్టు చేసిన సమంత.... అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్!

హీరోయిన్ సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన బికినీ ఫోటో హాట్ టాపిక్ అయింది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

చైతూ అమ్మకు సమంత కంప్లైంట్స్.. దేని గురించో తెలుసా..

చైతూ అమ్మకు సమంత కంప్లైంట్స్.. దేని గురించో తెలుసా..

చైతూ అమ్మకు సమంత కంప్లైంట్స్.. దేని గురించో తెలుసా..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బ్రేకప్ సీన్ చూసి.. థియేటర్ ‌నుంచి చైతూకి సమంత మెసేజ్

బ్రేకప్ సీన్ చూసి.. థియేటర్ ‌నుంచి చైతూకి సమంత మెసేజ్

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో బ్రేకప్ సీన్ చూసి.. థియేటర్ ‌నుంచి చైతూకి సమంత మెసేజ్ పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Pulling the curtains down on the speculations of his impending marriage with actress Samantha, Naga Chaitanya Akkineni has just made the big announcement. Addressing media at the Jio Filmfare Awards (South) press conference today, Chaitu revealed that he will marry Samantha at an auspicious muhurat on October 6.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu