»   » బ్రేకప్ సీన్ చూసి.. థియేటర్ ‌నుంచి చైతూకి సమంత మెసేజ్

బ్రేకప్ సీన్ చూసి.. థియేటర్ ‌నుంచి చైతూకి సమంత మెసేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సమంతతో పెళ్లి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పటికే చైతూ గాల్లో తేలిపోతున్నాడు. మిశ్రమ స్పందన కనిపించిన రారండోయ్ వేడుక చూద్దాం చిత్ర విజయంతో నాగ చైతన్యలో మరింత జోష్ పెరిగింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. సినిమా, సమంత, పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

మెసేజ్ పెట్టింది..

మెసేజ్ పెట్టింది..

రారండోయ్ వేడుక చిత్రాన్ని ఎడిటింగ్ దశలో, ఇతర విభాగాల్లో పని జరుగుతున్నప్పుడు ఎక్కువసార్లు సినిమా చూవాను. దాంతో నాకు జడ్జిమెంట్ పోయింది. సినిమా చూసిన సమంత నాకంటే ఎక్కువ సంతోషపడింది. తను సాధారణ ప్రేక్షకురాలిగా ఈ సినిమాను ఎంజాయ్ చేసింది. బ్రేకప్ సీన్ చూసిన తర్వాత ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని థియేటర్ నుండే నాకు మేసేజ్ పెట్టింది అని చైతూ తెలిపాడు.


లవ్ ప్రపోజల్స్ తిరస్కరిస్తే..

లవ్ ప్రపోజల్స్ తిరస్కరిస్తే..

నా జీవితంలో కూడా చాలా బ్రేకప్‌లు ఉన్నాయి. అమ్మాయిల వెంట తిరిగినా మన లవ్ ప్రపొజల్‌ను తిరస్కరిస్తే ఎవరైనా బాధపడుతారు. అలాంటి సంఘటనలు నా లైఫ్‌లో ఉన్నాయి. నా రియల్‌ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని రారండోయ్‌ చిత్రంలో సన్నివేశాల్ని సృష్టించాం. అయితే బ్రేకప్ సన్నివేశంలో తిట్టినట్లుగా నిజజీవితంలో ఎవరినీ బాధపెట్టలేదు అని నాగ చైతన్య తెలిపాడు.


అక్టోబర్‌లో పెళ్లి

అక్టోబర్‌లో పెళ్లి

అక్టోబర్‌లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం సమంత, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. హైదరాబాద్‌లో పెళ్లి ఉంటుంది. ప్రస్తుతం నేను నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అది పూర్తయిన తర్వాతే పెళ్లి పనులు మొదలుపెడుతాను. జూలై నుంచి సినిమాలకు బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నాను.


పెళ్లి తర్వాత న్యూయార్క్‌కు

పెళ్లి తర్వాత న్యూయార్క్‌కు

ఏం మాయ చేశావో చిత్ర షూటింగ్ సందర్భంగా న్యూయార్క్‌లో మా మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లైన తర్వాత న్యూయార్క్ వెళ్లి ఆ సినిమాను చిత్రీకరించిన ప్రదేశాల్ని మరోసారి చూడాలని అనుకుంటున్నాం. ఆ సినిమా ద్వారా మమ్మల్ని కలిపినందుకు గౌతమ్ మీనన్‌కు కృతజ్ఞతలు చెప్పాలి అని ఆయన అన్నారు.


నా ఆలోచనా విధానం మారదు..

నా ఆలోచనా విధానం మారదు..

పెళ్లి తర్వాత సినిమాల విషయంలో నా ఆలోచన విధానం మారదు. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణం. సమంత ఒప్పుకుంటుందా అంటే అవన్నీ సినిమాల్లో సాధారణమే. ప్రేమకథలున్నా అందులో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండకూడదని నేను కోరుకుంటాను. తనకు ఆ విషయం తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావు.


నా ఆలోచనా విధానం మారదు..

నా ఆలోచనా విధానం మారదు..

పెళ్లి తర్వాత సినిమాల విషయంలో నా ఆలోచన విధానం మారదు. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణం. సమంత ఒప్పుకుంటుందా అంటే అవన్నీ సినిమాల్లో సాధారణమే. ప్రేమకథలున్నా అందులో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండకూడదని నేను కోరుకుంటాను. తనకు ఆ విషయం తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావు.



English summary
Akkineni Naga Chaitanya latest Movie is Rarandoi Veduka Chuddam. Now it's going with good collections. Recently Naga Chaitanya shares about his thoughts, marriage etc.,
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu