»   » ‘పవన్ కళ్యాణ్‌ను ప్రేమిస్తా.... పవన్ ఫ్యాన్స్‌ను ద్వేషిస్తా’

‘పవన్ కళ్యాణ్‌ను ప్రేమిస్తా.... పవన్ ఫ్యాన్స్‌ను ద్వేషిస్తా’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండక పోతే రామ్ గోపాల్ వర్మకు నిద్ర పట్టదు. తాజాగా ఆయన మరో వివాదాస్పద ట్వీట్ చేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులపై తన ట్వీట్లతో విరుచుకుపడ్డారు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తన దైన రీతిలో సమాధానం ఇచ్చారు.

షాకింగ్ కామెంట్: పవన్ కళ్యాణ్ ఓ జోకర్.... 'సర్దార్'చూడను!
'భిన్నమైన కారణాల వల్ల నేను పవన్ కళ్యాణ్, దేవుడిని ప్రేమిస్తాను. అదే విధంగా అదే రకమైన కారణాలతో పవన్ కళ్యాణ్ అభిమానులను, దేవుడిని పూజించే భక్తులను ద్వేషిస్తాను' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చూసిన వెంటనే పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ వర్మకు రిప్లైలు ఇచ్చారు. తాగి వాగుతున్నాడని, అతనికి పిచ్చి ఎక్కిందని ఇలా రకరకాలుగా కామెంట్స్ చేసారు.

పిచ్చిగా ఊహించుకోవద్దు: ట్వీట్‌తో షాకిచ్చిన రేణు దేశాయ్ !

కొందరు లేడీ ఫ్యాన్స్ అయితే వర్మకు ఓ రేంజిలో వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమానులను ఎక్కువగా ఇరిటేట్ చేయొద్దు... ఏదో ఒకరోజు వారు నిన్ను కొడతారు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరికిందరు... అమావాస్య ప్రభావం వర్మపై ఇంకా తగ్గినట్లే లేదు అంటూ కామెంట్ల రూపంలో పంచ్ లు వేసారు.

Pawan kalyan

తేలింది: పవన్ కొట్టింది ఈ కమిడియన్ నే? కుళ్లు జోక్స్, కామెంట్స్ కారణం
నీలాంటి వాడి మాటలు ఎవరు పట్టించుకుంటూ...'పోరా బై' అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. మమ్మల్ని హేట్ చేసినా ఫర్లేదు భరిస్తాం... కానీ పవన్ కళ్యాణ్ ని ఏమైనా అంటే సహించం అంటూ గట్టిగా వర్నింగ్ ఇచ్చారు అభిమానులు. ఇలాంటి వార్నింగులు వస్తాయని వర్మకు కూడా తెలుసు....వాటిని ఎంజాయ్ చేద్దామనే ఇలాంటి ట్వీట్ చేసి ఉంటారు.

English summary
‘I love Pawan kalyan and God for different reasons and I hate devotees and P K fans for the same reason’ RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu