»   » షాకింగ్ కామెంట్: పవన్ కళ్యాణ్ ఓ జోకర్.... ‘సర్దార్’చూడను!

షాకింగ్ కామెంట్: పవన్ కళ్యాణ్ ఓ జోకర్.... ‘సర్దార్’చూడను!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం హిందీలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కి చెందిన ఓ వ్యక్తి పవన్ కళ్యాన్ మీద షాకింగ్ కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని.. తాను అతడి సినిమాలు చూడను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

'ఈ పవన్ కళ్యాణ్ కూడా హీరో అయితే.. ప్రపంచంలో ఎవ్వరైనా హీరో కావచ్చు. అసలీ సౌత్ ఇండియా జనాలకు ఏమైంది? సినిమాల్లో ఈ కార్టూన్ ను వాళ్లెలా చూస్తారు? వెరీ బ్యాడ్ చాయిస్. నేనైతే ఈ జోకర్ - కార్టూన్ సినిమాల బదులు రాజ్ పల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూస్తా'' అంటూ ట్వీట్స్ చేసాడు.


వాస్తవానికి... కమల్ ఆర్ ఖాన్ అనే వ్యక్తి బాలీవుడ్లో ఓ జోకర్ లాంటి వాడు. అతన్ని అక్కడ ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే కమల్ ఆర్ ఖాన్ కు కావాలని ఇలాంటి కాంట్రవర్సీలు చేయడం, పబ్లిసిటీ సంపాదించుకోవడం అతని అలవాటు. పవన్ కళ్యాణ్ మీద అతను చేసిన ట్వీట్స్ వల్ల పెద్దగా నష్టం ఉండదనే చెప్పాలి.


మరో వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం కమల్ ఆర్ ఖాన్ ను పట్టించుకోవడం లేదు. సింహాన్ని చూసి **** మొరగడం మామూలే అనే అని సరిపుచ్చుకుంటున్నారు.


సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం వెనక అసలు కారణం అదేనట. ఏప్రిల్ 8వ తేదీన తెలుగు, హిందీలో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న విషయాన్ని ఖరారు చేస్తూ ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేసారు. బాలీవుడ్లో దాదాపు ఎనిమిది వందల పైచిలుకు థియేటర్లలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యారు. సర్దార్ సినిమా ద్వారా తన సినిమా పరిధిని విస్తరించాలని నిర్ణయించుకున్నారని స్పష్టమవుతోంది.


కమల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్స్...


వివాదాస్పద ట్వీట్స్

వివాదాస్పద ట్వీట్స్

ఈ పవన్ కళ్యాణ్ కూడా హీరో అయితే.. ప్రపంచంలో ఎవ్వరైనా హీరో కావచ్చు అంటూ ట్వీట్


సౌత్ ప్రేక్షకులపై ట్వీట్

సౌత్ ప్రేక్షకులపై ట్వీట్

సౌత్ ఇండియా జనాలకు ఏమైంది? సినిమాల్లో ఈ కార్టూన్ ను వాళ్లెలా చూస్తారు? వెరీ బ్యాడ్ చాయిస్ అంటూ ట్వీట్ చేసాడు.


రాజ్ పల్ యాదవ్ సినిమా చూస్తా..

రాజ్ పల్ యాదవ్ సినిమా చూస్తా..

నేనైతే ఈ జోకర్ - కార్టూన్ సినిమాల బదులు రాజ్ పల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూస్తా'' అంటూ ట్వీట్స్ చేసాడు.


గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న విషయాన్ని ఖరారు చేస్తూ ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేసారు. బాలీవుడ్లో దాదాపు ఎనిమిది వందల పైచిలుకు థియేటర్లలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
కమాల్ ఆర్ ఖాన్

కమాల్ ఆర్ ఖాన్

పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద కామెంట్ చేసి కమాల్ ఆర్ ఖాన్ ఇతడే...


English summary
Controversial actor, producer Kamaal R Khan has shown his dissension side by attacking Pawan Kalyan on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu