»   » తేలింది: పవన్ కొట్టింది ఈ కమిడియన్ నే? కుళ్లు జోక్స్, కామెంట్స్ కారణం

తేలింది: పవన్ కొట్టింది ఈ కమిడియన్ నే? కుళ్లు జోక్స్, కామెంట్స్ కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిన్నటి రోజు వెబ్ మీడియాలో 'సర్దార్ గబ్బర్ సింగ్'సెట్ పై పవన్ ఓ కమిడయన్ చెత్త ప్రవర్తనతో విసుగెత్తి కొట్టాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ కమిడయన్ ఎవరనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న మాట ప్రకారం అతనెవరో కాదు షకలక శంకర్.

జబర్దస్త్ పోగ్రామ్ తో పాపులర్ అయిన షకలక శంకర్ తొలి రోజుల్లో రామ్ గోపాల్ వర్మ ని ఇమిటేట్ చేసేవారు. అది కూడా బాగా పాపులర్ అయ్యింది. తనదైన మ్యానరింజంలతో కామెడీ చేస్తూ బుల్లి తెరపైనా కాకుండా వెండితెరపైనా వేషాలు సంపాదిస్తున్నాడు.

Also Read: పవన్ కళ్యాణ్‌కు గుడి కడ్తా: షకలక శంకర్, డబ్బులొచ్చాక..

హీరో ఫ్రెండ్స్ రోల్స్ కు అతని దర్శకులు ఎంపిక చేసుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన తుంటరిలోనూ హీరో ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేసారు. అయితే తొలి రోజుల్లో తన పనేంటో తాను చూసుకు వెళ్ళే షకలక శంకర్.. ఈ మధ్యన నిర్మాతలను , దర్శకులను తన చెత్త కామెంట్స్ తో కుళ్లుకామెడీతో విసిగిస్తున్నాడనే కంప్లైంట్ ఉంది.

అసలు జబర్దస్త్ టీమ్ నుంచి వచ్చే వాళ్లు కామెడీకు తామే బ్రాండ్ అంబాసిడర్స్ మని భావించి దర్శకుడు చెప్పింది చేయటానికి కూడా ఇష్టపడరని టాక్ నడుస్తోంది. అలాగే పవన్ సెట్స్ పైనా బిహేవ్ చేసాడని అంటున్నారు.

అసలేం జరిగింది.. స్లైడ్ షోలో చూడండి...

పవన్ మీద భక్తి

పవన్ మీద భక్తి

పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన శంకర్ తన స్కిట్ ల ద్వారా కూడా పవన్ మీద భక్తిని చాటుకునేవాడు. అందుకు తగినట్లే సర్దార్ గబ్బర్ సింగ్ లో వేషం సంపాదించాడు.

వార్నింగ్

వార్నింగ్

పవన్ ని దేవుడు అని చెప్పుకునే శంకర్ కు పవన్ కల్యాణ్ గట్టి వార్నింగ్ మొదటి రెండు రోజుల్లోనే ఇచ్చాడట.

లేటు లతీఫ్

లేటు లతీఫ్

శంకర్ అందరూ సీనియర్ నటుల కన్నా షూటింగ్ కు ఆలస్యంగా రావటంతో, అతని కోసం ఎదురుచూసేవారని చెప్తున్నారు.

కో డైరక్టర్ తో తగువు

కో డైరక్టర్ తో తగువు

కో-డైరెక్టర్ ఏదైనా సీన్ చెబితే అతనితో వాగ్వాదానికి దిగేవాడట శంకర్. సెట్లో ఇదో చిరాకుగా మారింది.

సీన్ మారుస్తా

సీన్ మారుస్తా

ఇతర సినిమాలకు చేసినట్లే సీన్ పండటం లేదు, కామెడీ కలుపుతా అంటూ సీన్ మార్చేసే ప్రయత్నం చేస్తూండేవాడు.

పవన్ కు చేరింది

పవన్ కు చేరింది

ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకి చివరకు పవన్ కల్యాణ్ కు తెలియడంతో శంకర్ ను పిలిపించాడు.

తోక జాడించవద్దు

తోక జాడించవద్దు

‘సీన్ బాగా వచ్చేవరకు కో-డైరెక్టర్ తో కోఆపరేటివ్ గా ఉండాలని..తోక జాడించవద్దని' క్లాస్ పీకారట.

మారలేదు

మారలేదు

పవన్ తో అంత క్లాస్ పడ్డాక.. శంకర్ ఇకపైనైనా షూటింగ్ లలో కాస్త జాగ్రత్తగా ఉంటాడేమో అని భావించారు. అయినా మళ్లీ మొదటికే వచ్చాడు. ఈ సారి డైరక్టర్ బాబిపై జోక్స్ వేయసాగాడు.

రీటేక్ లు

రీటేక్ లు

డైరక్టర్ సీన్ లో ఇతని యాక్షన్ సాటిస్ ఫై కాక..రీ టేక్ అడిగితే..చేయటానికి ఇష్టపడేవాడు కాదు.

పవన్ కు తెలిసి

పవన్ కు తెలిసి

ఓ సారి వార్నింగ్ ఇచ్చినా మారకుండా దర్శకులపై కామెంట్ చేయటం, కుళ్లు జోక్ లు వేయటం పవన్ కు చేరింది

డిసిప్లేన్

డిసిప్లేన్

క్రమశిక్షణకు ప్రాణమిచ్చే పవన్ కు షకలక శంకర్ ఓ తలనొప్పిగా మారారు. దాంతో ఈ సారి మళ్లీ పిలిచాడు.

వినకుండా

వినకుండా

పవన్ పిలిచినప్పుడు..ఆయన చెప్పేది వినకుండా ఏదో ఎక్సపనేషన్ ఇవ్వటానికి ప్రయత్నించటంతో పవన్ కు మండి కొట్టాడని తెలుస్తోంది.

శ్రీకాకుళం నుంచి

శ్రీకాకుళం నుంచి

శ్రీకాకుళం జిల్లాకు చెందిన శంకర్ ఆర్థిక స్తోమత లేక పదో తరగతికే ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. అష్టకష్టాలు పడుతూ జీవితాన్ని నెట్టుకొచ్చే వాడు.

మంజునాధ చూసి

మంజునాధ చూసి

ఒకరోజు మంజునాథ సినిమా షూటింగ్‌లో చిరంజీవిని చూసి ఫిదా అయిపోయాడు.

అప్పుడే వచ్చాడు

అప్పుడే వచ్చాడు

ఎలాగైనా సినిమాల్లో నటించాలనుకుని 2002లో హైదరాబాద్ బస్సెక్కాడు. కాని శంకర్ కు అప్పుడు పెయింటింగ్ తప్ప ఇంకే పనీ రాదు.

నాలుగేళ్లపాటు

నాలుగేళ్లపాటు

హైదరాబాద్‌లో మొదట స్నేహితుల వద్ద ఉంటూ నాలుగేళ్ల పాటు పెయింటింగ్ పనికి వెళ్లాడు.

నిర్మలమ్మ దగ్గర

నిర్మలమ్మ దగ్గర

ఆ తర్వాత ప్రముఖ సినీనటి నిర్మలమ్మ వద్ద పనిచేశాడు. అప్పుడే సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి.

మొదట్లో..

మొదట్లో..

ఆఫీస్ బాయ్‌గా, ప్రొడక్షన్ బాయ్‌గా పని చేస్తూ సినిమాలు చూస్తూ గడిపేవాడు.

అదే బ్రేక్

అదే బ్రేక్

రన్ రాజా రన్ దర్శకుడు అప్పట్లో తాను తీసిన షార్ట్‌ఫిలింలో ఒక అవకాశం ఇచ్చాడు.దానిని సద్వినియోగం చేసుకున్నాడు.

షార్ట్ ఫిలిం సూపర్ హిట్

షార్ట్ ఫిలిం సూపర్ హిట్

షార్ట్ ఫిలిం క్లిక్ కావడంతో వెంటనే ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి జబర్దస్త్ కామెడీషోలో అవకాశం ఇవ్వడం.. ప్రేక్షకులు ఆదరించడంతో ఇక వెనుదిరిగి చూడలేదు.

ఫుల్ బిజీ

ఫుల్ బిజీ

తర్వాత గీతాంజలి, రన్ రాజా రన్ సినిమాల్లో దాదాపు ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ లో నటించాడు. అనేక సినిమాల్లో నటిస్తూ శంకర్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు.

నాగబాబు రికమండేషన్

నాగబాబు రికమండేషన్

పవన్ పై శంకర్ కు ఉన్న వీరాభిమానం నచ్చి కాబోలు నాగబాబు స్వయంగా షకలక శంకర్ కు పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్' లో పాత్ర ఇప్పించినట్లు తెలుస్తోంది.

శంకర్ సోదరుడుకు కూడా

శంకర్ సోదరుడుకు కూడా

శంకర్ సోదరుడు వరహాల బాబుకు కూడా పవన్ తన 'సర్దార్' సినిమాలో మరో రోల్ ఇచ్చిన విషయాన్ని శంకర్ ట్విట్టర్ ద్వారా బయట పెట్టాడు.

వీరిద్ధరికే కాకుండా...

వీరిద్ధరికే కాకుండా...

పవన్ జబర్దస్త్ లో నటిస్తున్న సుడిగాడు సుధీర్ వేణులకు కూడ పవన్ తన సినిమాలో పోలీసు కానిస్టేబుల్స్ గా పాత్రలను ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదే టాపిక్

ఇదే టాపిక్

పవన్ కు వీరాభిమానిగా పేరు పొందిన శంకర్ పవన్ కోసం గుడి కట్టిస్తానంటూ అప్పట్లో వార్తలలోకి ఎక్కాడు. అటువంటి వీరాభిమానికే పవన్ తన ఉగ్ర రూపం చూపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

English summary
Pawan Kalyan found that Shakalaka Shankar is making nasty comments on key unit members.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu