twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి బరిలో నెంబర్ వన్ ఏదీ? F2, ఎన్టీఆర్, వినయ విధేయ, పేట పరిస్థితి ఏంటంటే..

    |

    సంక్రాంతి బరిలో సూపర్‌స్టార్లు బరిలోకి దూకారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019లో పోటీ తీవ్రంగా కనిపించింది. బాలకృష్ణ, రజనీకాంత్, రాంచరణ్, వెంకటేష్, వరుణ్ తేజ్ తమ అదృష్టాన్నిపరీక్షించుకొనేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ స్టార్ హీరోల సినిమలపై ప్రేక్షకులు ఎలాంటి తీర్పునిచ్చారని తెలుసుకోవాలంటే నాలుగు సినిమాల గురించి తెలుసుకోవాల్సిందే..

     సంక్రాంతి బరిలో నెం. 1

    సంక్రాంతి బరిలో నెం. 1

    ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన F2 ఫన్ అండ్ ప్రస్టేషన్ మూవీ భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన వెంకటేష్ భారీ సక్సెస్‌ను అందుకొన్నారు. వరుణ్ తేజ్,తమన్నా, మెహ్రీన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను కలెక్ట్ చేస్తున్నది. సంక్రాంతి బరిలో నెంబర్ వన్‌గా నిలిచింది.F2 ఫన్ అండ్ ప్రస్టేషన్ మూవీ రివ్యూ కోసం

     పండుగ సీజన్లో నెంబర్ 2

    పండుగ సీజన్లో నెంబర్ 2

    ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎన్టీఆర్ కథా నాయకుడు చిత్రం జనవరి 9 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. కానీ కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయిందనే మాట వినిపిస్తున్నది.ఎన్టీఆర్ కథానాయకుడు పూర్తి సమీక్ష కోసం..

     మూడోస్థానంతో రాంచరణ్

    మూడోస్థానంతో రాంచరణ్

    రంగస్థలం సినిమా తర్వాత రాంచరణ్, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. సినిమా ఫస్టాఫ్ ఫీల్‌గుడ్‌గా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో యాక్షన్ సీన్లు ప్రేక్షకులను నిరాశను కలిగించాయి. అభిమానుల పెదవి విరుపు తర్వాత సెకండాఫ్‌లో కొన్ని సీన్లను తొలగించడంతో కొంత మెరుగ్గా ఉన్నట్టు టాక్ వస్తున్నది. విమర్శకుల టాక్ ఎలా ఉన్నా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది.వినయ విధేయ రామ పూర్తి రివ్యూ కోసం

     రజనీ మ్యాజిక్ కనుమరుగు

    రజనీ మ్యాజిక్ కనుమరుగు

    ఇక భారీ అంచనాల మధ్య సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం పేట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాలో రజనీకాంత్ మ్యాజిక్ కనుమరుగైందనే మాట వినిపిస్తున్నది.పేట సినిమా రివ్యూ కోసం..

    English summary
    Tollywood witness big releases for Sankrati 2019. F2 fun and frustations, ntr kathanayakudu, vinaya vidheya rama, petta movie hit the screens. These four movies are in race for box office collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X