For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినయ విధేయ రామ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|
Vinaya Vidheya Rama Movie Review And Rating 'వినయ విధేయ రామ' మూవీ రివ్యూ | Filmibeat Telugu

Rating:
2.0/5
Star Cast: రాంచరణ్, కియారా అద్వానీ, వివేక్ ఒబేరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్
Director: బోయపాటి శ్రీను

రంగస్థలం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం వినయ విధేయ రామ. యాక్షన్, మాస్ అంశాలను మేలవించి విభిన్నమైన చిత్రాలను అందించే బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యంలో ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందనే ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ చిత్రం రాంచరణ్‌కు మళ్లీ హిట్‌ను అందించిందా? కియారా అద్వానీ రెండో విఘ్నాని దాటడంలో సఫలమయ్యారా? బోయపాటి సక్సెస్ టూర్ కొనసాగుతుందా? దానయ్యకు ఈ చిత్రం కూడా కనకవర్షం కురిపిస్తుందా అనే విషయాలను తెలుసుకోవాలంటే కథ, కథనాలు గురించి మాట్లాడుకోవాల్సిందే..

వినయ విధేయ రామ మూవీ స్టోరీ

వినయ విధేయ రామ మూవీ స్టోరీ

ఐదుగురు అన్నదమ్ములతో కూడిన కుటుంబం (రాంచరణ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, ) బంధాలకు, అనుబంధాలకు మారుపేరుగా కనిపిస్తుంది. తన అన్నలపై ఈగ వాలకుండా కంటికి రెప్పల రామ్ కొణిదెల (రాంచరణ్) కాపాడుతుంటాడు. బీహార్‌లో ఎన్నికల అధికారిగా అన్నయ భువన్ కుమార్ (ప్రశాంత్)కు రాజ భయ్యా (వివేక్ ఒబేరాయ్)తో ముప్పు ఏర్పడటంతో రామ్ రంగంలోకి దిగుతాడు. తన కుటుంబానికి ముప్పు వాటిల్లితే వినయ, విధేయ రామ్ విధ్వంస రాముడిగా ఎలా మారాడానేది వినయ విధేయ రామ కథ.

వినయ విధేయ రామ మూవీ కథలో మలుపులు

వినయ విధేయ రామ మూవీ కథలో మలుపులు

అన్నదమ్ముల మధ్య బలమైన బంధాలు ఏర్పడటానికి కారణం ఏమిటి? వైజాగ్‌లో ఉండే రామ్ కుటుంబాన్ని బీహార్‌లో ఉండే రాజభయ్యా ఎందుకు టార్గెట్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ (కియారా అద్వానీ) పాత్ర ఎలా ఉంది? భువన్ కుమార్‌కు జరిగిన అన్యాయానికి రామ్ ఎలా బదులు తీర్చుకొన్నాడు? రంగస్థలం తర్వాత రాంచరణ్ పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎలా మెప్పించిందనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

ఫస్టాఫ్

ఫస్టాఫ్

అప్పుడే పుట్టిన కొణిదెల రామ్ (రాంచరణ్)‌ను తల్లి వదిలేసి వెళ్లడంతో నలుగురు అనాథలు చేరదీయడంతో కథ ప్రారంభమవుతుంది. అలాగే నలుగురు అనాథలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించే సీన్ ఉద్వేగానికి గురిచేస్తుంది. తన అన్నయ్యలపై ఎంత ఇష్టమనే చెప్పడానికి చూపించిన సీన్లు ఫీల్‌గుడ్‌గా సాగిపోతుంటాయి. ఇక కియారా ఇంట్రడక్షన్ తర్వాత హేమతో కూడిన ఎపిసోడ్ సినిమాను మరింత వినోదంగా మారుస్తుంది. ముఖేష్ రుషితో సన్నివేశాలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఓ చిన్న ఇంట్రెస్టింగ్ సీన్‌తో ఇంటర్వెల్‌ కార్డుతో తొలిభాగం ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది.

సెకండాఫ్‌లో

సెకండాఫ్‌లో

వినయ విధేయ రామ సెకండాఫ్‌కు వచ్చే సరికి కథంతా యాక్షన్ మోడ్‌లోకి మారిపోతుంది. మితిమీరిన హింస, రక్తపాతంతో తెర తడిసిముద్దవుతుంది. ఊహాకు అందని, సాధారణ ప్రేక్షకుడు జీర్ణించుకోలేని విధంగా సన్నివేశాలు కనిపిస్తాయి. వీటన్నిటి మధ్య స్నేహ నటన కొంత ఊరట కలిగిస్తుంది. దాంతో సినిమా సేఫ్ ట్రాక్‌ నుంచి డేంజర్ ట్రాక్‌లోకి వెళ్లినట్టు స్పష్టమవుతుంది. చివర్లో ఫ్యామిలీ సెంటిమెంట్‌తో లోపాలను సరిదిద్దుకునేందుకు చేసిన ప్రయత్నం చేజారిపోయినట్టు అర్ధమవుతుంది. దాంతో ఊర మాస్ ఎంటర్‌టైనర్‌ అని స్పష్టమవుతుంది.

దర్శకుడిగా బోయపాటి శ్రీను

దర్శకుడిగా బోయపాటి శ్రీను

చక్కటి బంధాలు, అనుబంధాలతో కూడిన కథకు బ్యాక్ డ్రాప్‌ను ఎన్నుకోవడంలో దర్శకుడిగా బోయపాటి తడబాటుకు గురి అయినట్టు కనిపిస్తుంది. తొలిభాగంపై పూర్తిగా పట్టు సాధించడంలో సఫలయ్యాడనే చెప్పవచ్చు. మాస్, క్లాస్‌ను మేళవించడంలో బోయపాటి సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇక సెకండాఫ్‌లో ఎంట్రీ అయిన తర్వాత కథ, కథనాలపై పట్టు కోల్పోయాడు. సరిదిద్దుకునే ప్రయత్నం చేసే సమయం కూడా లేకపోయినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని బ్యాడ్ సీన్లు తొలిభాగంలో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను ముంచేసిందని చెప్పవచ్చు.

రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్

రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్

రంగస్థలం తర్వాత మరో పరిణితి ఉన్న పాత్రలో కనిపించాడు రాంచరణ్. నటనపరంగా మరింత రాటుదేలాడని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లలో విజృంభించాడు. డ్యాన్సులతో అలరించాడు. తస్సాదియ్యా, రోమియో జూలియట్ పాటల్లో కియారా, రాంచరణ్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. రంగస్థలం తర్వాత ఇలాంటి క్యారెక్టర్‌లో ప్రేక్షకులు ఆలరించడం కష్టమే అనిపిస్తుంది.

కియారా అద్వానీ గ్లామర్

కియారా అద్వానీ గ్లామర్

కియారా అద్వాని విషయానికి వస్తే ఫస్టాఫ్‌లో ఒకట్రెండు సీన్లు తప్ప పెద్దగా నటించడానికి స్కోప్‌లేని పాత్రలో కనిపించింది. పాటల్లో రాంచరణ్‌కు సరైన జోడిగా కనిపించింది. మంచి ఈజ్‌తో డ్యాన్సులు చేసింది. గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు వచ్చే అవకాశం లేదు. జస్ట్ పాటలకు మాత్రమే పరిమితమైందని చెప్పవచ్చు.

 సపోర్టింగ్ క్యారెక్టర్లు

సపోర్టింగ్ క్యారెక్టర్లు

నలుగురు సోదరుల్లో ప్రశాంత్ పాత్ర బాగా ఎలివేట్ అయిందని చెప్పవచ్చు. కథ పూర్తిగా ఆయన చుట్టే తిరగడం వల్లన ఆయన పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. కాకపోతే పెర్ఫార్మెన్స్‌కు అవకాశం లేని పాత్రలో కనిపించాడు. అర్యన్ రాజేష్ ఉన్నాడనే ఫీలింగ్ కూడా కలుగదు. ఇక చలపతిరావు ఒకట్రెండు సీన్లలో ఆకట్టుకొన్నాడు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా హేమ ఇరుగదీసింది. హేమకు భర్తగా థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఒకే అనిపించాడు.

విలన్ పాత్రల్లో

విలన్ పాత్రల్లో

విలన్ల పాత్రల్లో వివేక్ ఒబేరాయ్, ముఖేష్ రుషి కనిపించారు. కొన్ని సీన్లలో వివేక్ ఒబేరాయ్ ఫర్వాలేదనిపించాడు. కథ, కథనాల్లో పసలేకపోవడం వల్ల విలన్ పాత్రలు కూడా తేలిపోయాయి. ముఖేష్ రుషి పరిస్థితి కూడా అంతే అని చెప్పవచ్చు. బలమైన విలన్ పాత్రలు లేని లోటు సినిమాలో కొట్టించింది.

దేవీ శ్రీ మ్యూజిక్ గురించి

దేవీ శ్రీ మ్యూజిక్ గురించి

సాంకేతిక విభాగాల్లో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎప్పటిలానే బాగుంది. తస్సాదియ్యా, రోమియో జూలియట్, ఏక్ బార్ పాటలు క్యాచీగా ఉండటమే కాకుండా మంచి జోష్‌ను కలిగిస్తాయి. తందానా తందానే పాట చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ నచ్చే విధంగా ఉంది. కీలక సన్నివేశాల్లో రీరికార్డింగ్‌‌తో దేవీ శ్రీ ప్రసాద్ ఇరుగదీశాడని చెప్పవచ్చు.

సినిమాటోగ్రఫి, ఇతర అంశాలు

సినిమాటోగ్రఫి, ఇతర అంశాలు

వినయ విధేయ రామ చిత్రానికి రిషి పంజాబి, ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రఫిని అందించారు. తొలిభాగంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలివేట్ అయ్యేలా మూడ్‌ను క్రియేట్ చేసే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారు. కలర్ ప్యాటర్న్, లైటింగ్ బాగుంది. అజర్ బైజాన్‌లో యాక్షన్ పార్ట్ అదిరిలే ఉంటుంది. ఆర్ట్ విభాగం పనితీరు కూడా చక్కగా కనిపించింది.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

సినిమాను రిచ్‌గా, క్వాలిటీగా ఉండటానికి డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ రాజీపడలేదని ఫీలింగ్ కలుగుతుంది. అజర్ బైజాన్ లాంటి ప్రాంతాల్లో చేసిన షూట్‌కు డీవీవీ దానయ్య రాజీ పడలేదనే విషయం బోధపడుతుంది. భారీ చిత్రాలను అందించడంలో దానయ్య తన టేస్ట్‌ను ఈ సినిమా ద్వారా రుచిచూపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కథ, కథనాలు గురించి పట్టించుకోకపోవడం ప్రధానమైన మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

కుటుంబ పరమైన ఎమోషన్స్‌కు, ఊర మాస్ అంశాలను మేళవించిన చిత్రం వినయ విధేయ రామ. ఊహకు అందని విధంగా ఉండే కొన్ని సీన్లు ప్రేక్షకులను నివ్వెరపాటుకు గురిచేస్తాయి. సంక్రాంతి రేసులో మెగా ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలిగించే విధంగా ఉంటుంది. సక్సెస్ ట్రాక్‌లో ఉన్న రాంచరణ్‌కు కొంత బ్రేక్ వేసే చిత్రమనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే విజయాన్ని అందుకొనే అవకాశాలు ఉన్నాయి.

బలం, బలహీనత

బలం, బలహీనత

ప్లస్ పాయింట్స్

  • రాంచరణ్ పెర్ఫార్మెన్స్
  • బోయపాటి శ్రీను
  • కియారా గ్లామర్
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్
 తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: రాంచరణ్, కియారా అద్వానీ, ఇషా గుప్తా, వివేక్ ఒబేరాయ్, మహేష్ మంజ్రేకర్, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ, హేమ తదితరులు

దర్శకత్వం: బోయపాటి శ్రీను

నిర్మాత: డీవీవీ దానయ్య

సంగీతం: దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫి: రిషి పంజాబి, ఆర్థర్ ఏ విల్సన్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్

రిలీజ్: 2018-01-11

English summary
Vinaya Vidheya Rama action film written and directed by Boyapati Srinu. The film features Ram Charan and Kiara Advani, who made her debut in Tollywood with Bharat Ane Nenu, in the lead roles. Vivek Oberoi stars as the antagonist in this film which also has Prashanth, Aryan Rajesh, Sneha and Ananya in pivotal roles. Devi Sri Prasad has composed the music for the film, while senior producer DVV Danayya is bankrolling this film under the DVV Entertainments banner. This movie released on January 11, 2019. In this occassion, Telugu filmibeat brings exclusive review.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more