For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మీదపడి పెదవులు కొరికాడు.. భార్యకు కూడా నరకం.. బతికుండగానే బాలకృష్ణకు డెత్ డేట్

  |

  టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన మీడియాలో చేసిన హంగామా మీకోసం..

  మాజీ క్రికెటర్ ప్రియురాలు సంచలన నిర్ణయం.. 59 ఏళ్ల వయసులో గర్భవతిగా!

  మాజీ క్రికెటర్ ప్రియురాలు సంచలన నిర్ణయం.. 59 ఏళ్ల వయసులో గర్భవతిగా!

  బాలీవుడ్ సంచలన నటి నీనా గుప్తా గురించి తెలియని వారుండరు. సహజీవనం అంటేనే అంతా ఆశ్చర్యపోయే రోజుల్లో ఈ సీనియర్ నటి వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో ఘాటు ప్రేమాయణం సాగించింది. నటిగా, బుల్లితెరపై దర్శకురాలిగా రాణిస్తోంది. ప్రస్తుతం నీనా గుప్తా వయసు 59 ఏళ్ళు. వయసు పెరిగే కొద్దీ నటీమణులు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ నీనా గుప్తా తాజాగా నటిస్తున్న బదాయి హో చిత్రంలో పోషిస్తున్న పాత్ర గురించి తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చికిత్స కోసం ఆస్ట్రియాకు వెళ్లిన అనుష్క.. ఇండియాలో సాధ్యం కాకపోవడంతో!

  చికిత్స కోసం ఆస్ట్రియాకు వెళ్లిన అనుష్క.. ఇండియాలో సాధ్యం కాకపోవడంతో!

  స్టార్ హీరోయిన్ అనుష్క భాగమతి చిత్రం మరో సినిమాకు సైన్ చేయలేదు. బాహుబలిలో దేవసేనగా అద్భుతంగా నటించిన అనుష్క రెండేళ్ల నుంచి ఒక్క సినిమాని కూడా అంగీకరించలేదు. గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా అనుష్క మెప్పించింది. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. కానీ ఇటీవల అనుష్క నుంచి ఒక్క చిత్రం కూడా రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. తాజగా అనుష్క గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. చికిత్స నిమిత్తం అనుష్క ఆస్ట్రియాకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తడి అందాలతో రకుల్.. 'ఆకుచాటు పిందె తడిసె' అంటూ బాలయ్య చిందులు!

  తడి అందాలతో రకుల్.. 'ఆకుచాటు పిందె తడిసె' అంటూ బాలయ్య చిందులు!

  స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిగ్గజ నటి శ్రీదేవి పాత్రలో రకుల్ ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. శ్రీదేవి పాత్రలో నటించడం తనకు దక్కిన గౌరవం అని రకుల్ ప్రీత్ తెలిపింది. నేడు రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి గెటప్ లో ఉన్న ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రకుల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ లుక్ విడుదల చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అభిమానులని మరో మారు థ్రిల్‌కి గురిచేసింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హరికృష్ణపై ఎన్టీఆర్ చేయి వేసి.. 30 ఏళ్ల తరువాత మా బాబాయ్‌తో!

  హరికృష్ణపై ఎన్టీఆర్ చేయి వేసి.. 30 ఏళ్ల తరువాత మా బాబాయ్‌తో!

  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు భాగాలుగా ఈచిత్రం తెరకెక్కుతోంది. బాలయ్య స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నటించే ప్రముఖ నటీనటులు ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ విభిన్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, పైగా బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తునడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత విశేషాలని దర్శకుడు క్రిష్ వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన ప్రీ లుక్ విడుదల చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  క్రికెటర్ మలింగ బాగోతాన్ని బయట పెట్టిన చిన్మయి.. సంచలన వ్యాఖ్యలు!

  క్రికెటర్ మలింగ బాగోతాన్ని బయట పెట్టిన చిన్మయి.. సంచలన వ్యాఖ్యలు!

  భారత చిత్ర పరిశ్రమలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తనుశ్రీ దత్త ఈ పోరాటం మొదలు పెట్టిన తరువాత మిగిలిన హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన వేధింపులని ధైర్యంగా ప్రస్తావిస్తున్నారు. ప్రముఖ సింగర్ చిన్మయి కూడా గత కొన్ని రోజులుగా తనకు ఎదురైన లైంగిక వేధింపులని ప్రస్తావిస్తోంది. తాజాగా ఈ ఉద్యమ సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. క్రికెటర్ మలింగ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనని చిన్మయి ట్విట్టర్ వేదికగా బయట పెట్టింది. బాధితురాలు చిన్మయికి ఈ సంఘటన వివరించిందట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయి తెలుగు హీరోతో ఎఫైర్.. ఫోటోస్ వైరల్!

  భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయి తెలుగు హీరోతో ఎఫైర్.. ఫోటోస్ వైరల్!

  ''ముసుగు వేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద'' అంటూ ఖడ్గం సినిమాలో సెక్సీ యాటిట్యూడ్‌తో టాలీవుడ్ కుర్రకారును ఊర్రూతలూగించిన కిమ్ శర్మ గుర్తుందా? తాజాగా ఈ బ్యూటీ తెలుగు హీరో హర్షవర్దన్ రాణెతో ఎఫైర్ పెట్టుకుని హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరి ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతే కాదు త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రేమ జంట శ్రీలంకలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వాడిని నేనే అలా మార్చా, మళ్లీ హీరోను చేసే ఉద్దేశ్యం లేదు: త్రివిక్రమ్

  వాడిని నేనే అలా మార్చా, మళ్లీ హీరోను చేసే ఉద్దేశ్యం లేదు: త్రివిక్రమ్

  టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ కమెడియన్లలో ఒకరిగా తన హవా కొనసాగించిన సునీల్ ఆ తర్వాత హీరోగా టర్న్ అయ్యారు. అయితే హీరోగా ఒకటి రెండు హిట్స్ మినహా మిగతావన్నీ నిరాశ పరచడంతో మళ్లీ రివర్స్ గేవర్ వేశారు. ప్రస్తుతం సునీల్ 'అరవింద సమేత' ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా సునీల్ మాట్లాడుతూ ఇది నాకు కమెడియన్‌గా పర్ఫెక్ట్ రీ ఎంట్రీ అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ‘అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... రేటింగ్ 4/5

  ‘అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... రేటింగ్ 4/5

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలిసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని అభిమానుల్లో కల్పించాయి. తాజాగా యంగ్ టైగర్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపుతూ పస్ట్ రివ్యూ వచ్చేసింది. సెన్సార్ కాపీ చూసిన అనంతరం ఉమైర్ సంధు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. అతడు సినిమా గురించి ఏ చెప్పాడో ఓ లుక్కేద్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  తొడగొట్టడం పాత పద్దతి.... కొత్త స్టైల్ పరిచయం చేసిన త్రివిక్రమ్!

  తొడగొట్టడం పాత పద్దతి.... కొత్త స్టైల్ పరిచయం చేసిన త్రివిక్రమ్!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రం ఇప్పటి వరకు వచ్చిన ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న సినిమాకు భిన్నంగా ఉందని, గొడవల్లో కత్తులతో నరుక్కునే సీన్లను కూడా రీటీన్‌గా కాకుండా డిఫరెంటుగా ప్రజెంట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్‌కు యంగ్ టైగర్‌తో ఇది మొదటి సినిమా. అదే సమయంలో ఆయన చేసిన తొలి ఫ్యాక్షన్ మూవీ ఇది. అందుకే సినిమాతో పాటు తారక్‌ను కూడా విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలంటే తొడగొట్టడం లాంటివి కనిపిస్తాయి. ఇందులో అలాంటి రోటీన్ సీన్లు కనిపించకుండా త్రివిక్రమ్ జాగ్రత్త పడ్డాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా సీన్లు కట్ చేశారు, జీడి పప్పులా వాడారు: ‘అరవింద సమేత'పై సునీల్

  నా సీన్లు కట్ చేశారు, జీడి పప్పులా వాడారు: ‘అరవింద సమేత'పై సునీల్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో దర్శకుడు త్రివిక్రమ్‌, చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో నైజా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, నటులు సునీల్, నవీన్ చంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమెడియన్ సునీల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఫ్రెండ్ త్రివిక్రమ్ ముందే పంచ్ డైలాగులు వేస్తూ అందరినీ నవ్వించాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాన్న మరణాంతరం అలా జరిగింది, తట్టుకోలేకపోయా.. అమ్మ దు:ఖంలో.. మంచి భర్తగా మారిపోయా.. ఎన్టీఆర్

  నాన్న మరణాంతరం అలా జరిగింది, తట్టుకోలేకపోయా.. అమ్మ దు:ఖంలో.. మంచి భర్తగా మారిపోయా.. ఎన్టీఆర్

  అరవింద సమేత షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. ఆ విషాద సంఘటన తర్వాత చిత్రీకరించిన పెనిమిటి పాటతో మరోసారి విషాదంలో మునిగిపోయానని ఎన్టీఆర్ వెల్లడించారు. 11న అరవింద సమేత రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మీదపడి పెదవులు కొరికాడు.. భార్యకు కూడా నరకం.. క్వీన్ దర్శకుడిపై నటి ఆరోపణలు

  మీదపడి పెదవులు కొరికాడు.. భార్యకు కూడా నరకం.. క్వీన్ దర్శకుడిపై నటి ఆరోపణలు

  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, క్వీన్ మూవీ దర్శకుడు వికాస్ బెహల్‌పై లైంగిక ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో మరోసారి సంచలనంగా మారింది. బాంబే వెల్వెట్ ప్రమోషన్‌ టూర్‌లో తనను లైంగిక వేధించాడని ఓ నటి ఆరోపణలు చేసింది

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలకృష్ణను గూగుల్ తల్లి చంపేసింది.. దారుణంగా డేత్ డేట్.. తప్పు ఎలా జరిగిందంటే..

  బాలకృష్ణను గూగుల్ తల్లి చంపేసింది.. దారుణంగా డేత్ డేట్.. తప్పు ఎలా జరిగిందంటే..

  ఇంటర్నెట్‌లో ఎలాంటి పొరపాటైన జరుగవచ్చు అనే సంఘటనకు ఉదాహరణగా బాలకృష్ణ వికీపీడియా పేజ్ నిలిచింది. బాలకృష్ణ మరణించారంటూ చూపిస్తున్న విధానం గూగుల్ లోపాలకు నిదర్శనంగా మారింది. ఎందుకు ఏం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆయనను బాధపెట్టడం ఇష్టం లేదు.. అందుకే మౌనం.. అత్తారింటికి దారేది తర్వాత.. త్రివిక్రమ్

  ఆయనను బాధపెట్టడం ఇష్టం లేదు.. అందుకే మౌనం.. అత్తారింటికి దారేది తర్వాత.. త్రివిక్రమ్

  అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత అంశాలను తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. త్రివిక్రమ్ చెప్పిన విషయాలను ఆయన మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆ ఇద్దరంటే నాకు నచ్చదు.. వాళ్లు తవ్వుకొన్న గోతిలో వాళ్లే పడ్డారు.. కౌశల్

  ఆ ఇద్దరంటే నాకు నచ్చదు.. వాళ్లు తవ్వుకొన్న గోతిలో వాళ్లే పడ్డారు.. కౌశల్

  బిగ్‌బాస్ తెలుగు 2 విజేత కౌశల్ తన ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్‌బాస్‌లో జరిగిన విషయాలను పూసగుచ్చినట్టు వెల్లడిసున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Rashmika Mandanna, Shilpa Shetty, Chiranjeevi, Sri Reddy, Bigg Boss 2, Kaushal, Babu Gogineni, Aravind Sametha movie, Nutan Naidu, Bigg Boss and others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X